మొవ్వ, కూచిపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరు జె. నివాస్ గురువారం మొవ్వ మరియు కూచిపూడిలలో గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది పనితీరు, సచివాలయాల పనితీరు ఆరా తీశారు. నిబంధనల మేరకు ప్రభుత్వ పధకాల సమాచారం, లబ్దిదారుల వివరాలు సరిగా డిస్ ప్లే చేశారా లేదా పరిశీలించారు. సచివాలయాల సేవలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయా, గ్రీవెన్సు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించారా లేదా రికార్డులు పరిశీలించారు. సిబ్బంది బయో మెట్రిక్ హాజరు అమలు పరిశీలించారు. ప్రతిరోజు ఫీవర్ సర్వే చేస్తున్నారా, ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మాలో నివేదికలు పంపుతున్నారా కలెక్టరు పరిశీలించారు. 3వ దశ కరోనా రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ప్రతి వాలంటీరు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని, ఫీవర్ సర్వే నిరంతరంగా నిర్వహించాలని, అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు గల వారికి టెస్టింగ్ చేయించడం, మందులు అందజేయడం జరగాలన్నారు. జిల్లా స్థాయిలో 3వ దశ కరోనా నివారణపై ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులల్లో 2 వేల ఆక్సిజన్‌తో కూడిన అదనపు పడకలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ప్రయివేటు ఆస్పత్రులలో 100 పడకలు దాటిన ఆస్పత్రులలో 14 వేల లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తున్నట్లు కలెక్టరు తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రులలో నోడల్ అధికారిని నియమించి ఎప్పటికప్పుడు కోవిడ్ పర్యవేక్షిస్తు అవసరమైన నివేదికలు అందించాలని అన్నారు. సచివాలయాల వద్ద ప్రభుత్వ సంక్షేమ పధకాల వివరాలు సరిగా ప్రదర్శన చేయని కారణంగా సంబంధిత అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొవ్వ ఎంపిడివో ఇన్ ఛార్జి శ్రీనివాసరెడ్డి, తహసిల్దారు డి. రాజ్యలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి ఎడిఎ శ్రీనివాసరావు సంబంధిత అధికారులు సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.
Tags movva
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …