విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్రవారం సెంట్రల్ నియోజకవర్గంలోని దుర్గపురం నందు 197, 198 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని తెలిపారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Tags vijayawada
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …