విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 15 వ తేదీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలి కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇందిరా గాంధి స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లును కమిషనర్ అధికారులుతో కలసి పర్యవేక్షించారు. వర్షం వచ్చిన వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్షపు నీటిని వెంటనే తోడించే ప్రక్రియను అధికారులు చేపట్టాలన్నారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముందుగానే పేరేడ్ గ్రౌండ్ కు చేరుకుని వారికి కేటాయించి సీట్లలో ఆశీనులు కావాలన్నారు. చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటేశ్వరరావు, అధికారులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …