Breaking News

పోలీస్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జెసి మాధవీలత…

-ప్రోటోకాల్ నిబంధనల మేరకు విఐపిలకు, ప్రజాప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింటు కలెక్టర్ డా. కె. మాధవీలత రెవిన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జాయింటు కలెక్టర్ డిఆర్వో, ఆర్ డివోలతో కలసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ సందర్శించి అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు ఆగస్టు 15వ తేది ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. గ్రౌండ్ లో అవసరమైన గ్రవెల్ లో ఎత్తుపల్లాలు సరిచేయించాలని గ్రౌండంతా పరిశుభ్రంగా సిద్ధం చేయాలని మార్చిఫాస్ట్ శకటాల ప్రదర్శన నిర్వహణకు ట్రాక్ సిద్ధం చేయాలని, రోలర్ పెట్టి చదును చేయాలని, వాటరింగ్ చేయించాలని అన్నారు. డయాస్ పూలకుండీలతో అలంకరించాలన్నారు. గ్రౌండ్ కు ఒక వైపు ఎల్ షేలో స్టాల్స్ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మరో వైపు ఎల్ షేలో పబ్లిక్ వేడుకలను వీక్షించే విధంగా అవసరమైన వాటర్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేయించాలన్నారు. విఐపి గ్యాలరీ, ప్రెస్ గ్యాలరీ జిల్లా అధికారుల కోసం మరియు మెరిటోరియస్ సర్టిఫికెట్లు పొందేవారు కూర్చొటానికి వేరువేరుగా సీటింగ్ ఏర్పాట్లు గావించాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి టెంట్లు అన్ని వాటర్ ప్రూఫ్ ఏర్పాటు చేయలన్నారు. వేడుకల కోసం ఆహ్వన పత్రాలు విఐపిలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముందుగా పంపాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధులను లేదా వారి కుటుంబ సభ్యులను ముందుగా ఈ వేడుకలకు ఆహ్వనించి ఘనంగా సత్కరించుటకు తగిన ఏర్పాట్లు చేయలన్నారు.

ప్రోటోకాల్ నిబంధనల మేరకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలి…
ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకలలో పాల్గొనే విఐపిలు, ఎంపి, ఎమ్మెల్సీ, ఎమ్మెఎలు, స్థానిక ప్రజాప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని జెసీ అధికారులకు సూచించారు. అర్బన్లో వార్డు సచివాలయ సిబ్బంది, విఆర్వోలు, అంగన్‌వాడీలు, పంచాయితీ సెక్రటరీలు ఈ వేడుకల్లో పాల్గొనాలన్నారు. మెయిన్ డయాస్ పై విఐపిలకు సీటింగ్ ఏర్పాట్లతో పాటు వారికి స్వీట్ హాట్ డ్రై ఫ్రూట్స్, జ్యూస్, కొబ్బరినీరు వంటి స్నాక్స్ సర్వింగ్ ఏర్పాట్లు చేయలన్నారు. మెరిట్ సర్టిఫికెట్లు పంపిణీ తోపులాటలు లేకుండా క్రమబద్ధంగా జరిగేలా చూడాలన్నారు. వివిధ శాఖల సంక్షేమ పధకాల సమాచారంతో శకటాల ప్రదర్శన క్రమబద్ధంగా జరగాలని సూచించారు.
డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి, ఎఆర్ ఎఎస్పీ బి. సత్యన్నారాయణ, డిడి మత్స్యశాఖ వెంకటేశ్వర రెడ్డి, తాసిల్దారు డి. సునీల్ బాబు, తదితరులు జెసి పరిశీలనలో పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *