Breaking News

సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలు…

-స్వాతంత్ర్య స్ఫూర్తి నింపిన సాంప్రదాయ కళరూపాలు
-ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కర్రసాము

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా విజయవాడ సబ్ కలెక్టర్ క్యార్యాలయ ఆవరణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక, విద్య, సాంప్రదాయ ప్రదర్శనలు జరిగాయి. వీటిలో ప్రధానంగా కర్రసాము ప్రదర్శన అందరిని అకటుకుంది. సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ కర్ర చేతపట్టి కర్రసాము ప్రదర్శనలో పాల్గొని అందరిలో ఉత్సహాన్ని నింపారు. తెలుగు సంప్రదాయ కళ అయిన కర్రసాము ప్రదర్శనను 44 మంది సుశిక్షుతులైన బాలికలు ప్రదర్శించారు. వీరు ప్రగతి పూర్ణ మాస్టారు, కర్రసాములో నిష్ణాతులైన సీనియర్ సిటీజన్సచే శిక్షణ పొందారు. ఈ బాలికల కర్రసాము ప్రదర్శన అందరి మన్ననలను అందుకుంది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న ప్రదర్శనకారుల బృందాన్ని, వారికి శిక్షణనిచ్చిన కర్రసాము గురువు వెంకటేశ్వరరావు, ఉ మామహేశ్వరి, ఎస్. పుర్ణచంద్రరావులు సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ అభినందించారు. ఈ బాలికలు దివిసీమ కృష్ణాజిల్లా వేర్వేరు ప్రాంతాలతో పాటుగా ఇతర జిల్లాలకు చెంది, కృష్ణాజిల్లాలో విద్యాభ్యాసం చేస్తూ ఉ న్నవారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ జి. ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 ఆగస్టు 15 నాటికి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అందరిలో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపేందుకు ఏడాది కాలం పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా దేశభక్తిని పెంపొందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 30 మంది పౌరులు, ఆర్టిస్టులతో రాష్ట్రీయగాన్ (జాతీయ గీతాలపాన) రికార్డింగ్ చేయించి రాష్ట్రీయగాన్ పోటీలకు పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ ఎఓ శ్రీనివాస్ రెడ్డి, తహాశీల్జార్ వెన్నెల శ్రీనివాస్, పలువురు డిప్యూటీ తహాశీల్డోర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *