Breaking News

భూగర్భ డ్రైనేజ్ సమస్యలపై చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొంగే భూగర్భ డ్రైనేజీ సమస్యలపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బాలాజీ నగర్, సిమెంట్ గోడౌన్ ప్రాంతం, కృష్ణలంక ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కృష్ణలంక బాలాజీ నగర్ లో భూగర్భ డ్రైనేజ్ పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా, ఆ సమస్యను తీర్చేందుకు చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ట్రంక్ లైన్ రిపేరు పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భూగర్భ డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిమెంట్ గోడౌన్ వద్ద అమృత 2.0 పథకం ద్వారా 2.8 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఎటువంటి సమస్యలున్న తమకు తెలుపమన్నారు, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *