Breaking News

మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్సు(MPI)పై రాష్ట్రాలు రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి రాష్ట్రం మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్సుకు సంబంధించి రిఫార్మ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ సలహాదారు(సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-SDGs)సాన్యుక్తా సమాదార్(Sanyukta Samaddar)చెప్పారు.అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21మరియు మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్స్(MPI)పై శుక్రవారం రెండవ రోజు రాష్ట్ర స్థాయి వర్కుషాపు జరిగింది.ఈసదస్సులో నీతి ఆయోగ్ సలహాదారు సమాదార్ మాట్లాడుతూ మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను సెన్సిటైజ్ చేయడం జరుగుతోందని తెలిపారు.ఈలక్ష్యాల సాధనకై టార్గెట్ మరియు టైమ్ లైన్లను ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఎంపిఐ ర్యాంకింగ్ లో ప్రపంచంలో 107 దేశాలల్లో భారత దేశం 62 వస్థానంలో నిలవగా దేశంలో ఆంధ్రప్రదేశ్ 9 ర్యాంకులో ఉందని ఆమె పేర్కొన్నారు.ఎంపిఐకి సంబంధించిన వివిధ పారామీటర్లకు అనుగుణంగా రిఫార్మ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ సలహాదారు సాన్యుక్తా సమాదార్ సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల తరుపున సియం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ మానవాభివృద్ధి సూచికల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎస్డిజి ఇండియా ఇండెక్సు రిపోర్టు-2020 ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడవ స్థానంలో ఉందని కాని రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాల్సి ఉందని కావున మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాల్సి ఉందని చెప్పారు.పేదరిక నిర్మూలనకు సంబంధించిన వివిధ పధకాలకు పెద్దఎత్తును నిధులు సమకూర్చడంతో పాటు వివిధ పారామీటర్లపై సెన్సిడైజేషన్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరుగుతోందని తెలిపారు.గ్రామ,వార్డు సచివాలయాల మొదలు రాష్ట్ర స్థాయి వరకూ సక్రమంగా ప్రణాళిక ప్రకారం కృషి చేస్తే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టవచ్చని ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి వర్యులు విద్య,వైద్యం,పేదరిక నిర్మూలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టి 75శాతం సమయం వాటిపైనే వెచ్చిస్తున్నందున ఈసారి ఎస్డిజి ర్యాంకింగ్ లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపేలా ప్రణాళికాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.ఇందుకుగాను కొన్ని యాక్సనబుల్ పాయింట్లను సిద్ధం చేసుకుని ఒక పరీక్ష మాదిరిగా సిద్ధమై మొదటి స్థానం సాధించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.రెండు రోజుల పాటు ఇక్కడ ఈవర్కుషాపును నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున నీతి ఆయోగ్ కు కృతజ్ణతలు తెలిపారు.
రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి జిఎస్ఆర్కె విజయకుమార్ మాట్లాడుతూ రెండు రోజుల వర్కు షాపులో ఎస్డిజి లక్ష్యాల సాధనపై రాష్ట్ర,జిల్లా స్థాయి అధికారులకు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అనేక అంశాలపై సెన్సిటైజ్ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.నిర్దేశిత లక్ష్యాల సాధనలో ఏఏ అంశాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే దానిపై దిశా నిర్దేశం చేసినందున ఆయా అంశాలపై మరింత దృష్టి పెట్టి మెరుగైన లక్ష్యాల సాధనకు కృషి చేయాల్సి ఉందని తెలిపారు.అనేక అంశాలపై విస్తృత అవగాహన కలిగించడం తోపాటు మరింత సమాచారం పొందేందుకు ఈవర్కు షాపు ద్వారా అవకాశం కలిగిందని విజయకుమార్ చెప్పారు.
ఈవర్కుషాపులో నీతి ఆయోగ్ ఎస్డిజి అధికారి అలెన్ జాన్,ఎనలిటిక్స్ అధికారి సౌరవ్ దాస్, సిపిఓలు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *