అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులపై సర్వే నిర్వహించి రెండున్ ర నెలల్లో సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్ని జిల్లాల రెవెన్యూ అధికారులు,మైనారిటీ సంక్షేమ అధికారులను ఆదేశించారు.శుక్రవారం అమరావతి సచివాలయంలో 13 జిల్లాల రెవెన్యూ అధికారులు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు తదితరులతో మైనారిటీ సంక్షేమ శాఖపై ఆయన సమీక్షిచారు.ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదర్శి చంద్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 10వేల 600 వక్ఫ్ ఆస్తులుండగా ఇప్పటికే సుమారు 3500 ఆస్తుల సర్వేను పూర్తి చేసి నోటిఫై చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని మిగిలిన 7,100 ఆస్తుల సర్వేను సమగ్ర భూ రక్షణ సర్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా రెవెన్యూ అధికారులు,మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు కలిసి కూర్చుని మిగిలిన ఆస్తుల సర్వే ఏ విధంగా పూర్తి చేయాలో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఎస్సీ,క్రైస్తవులు,ముస్లింలకు తప్పక స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాల్సి ఉందని కావున సాంఘిక సంక్షేమశాఖ అధికారులు, తహసిల్దారులతో సమన్వయం చేసుకుని సమస్యను త్వరితగతిని పరిష్కరించాలన్నారు.ఏఏ గ్రామాల్లో స్మశాన వాటికలకు స్థలాలు అందుబాటులో ఉంది ఇంకా ఏఏ గ్రామాల్లో స్థలాలు అవసరం ఉందనే దానిపై నిర్దేశిత ప్రొఫార్మాలో వివరాలను సమర్పించాలని ఆదేశించారు.అంతేగాక వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకై చుట్టూ కాంపౌండ్ వాల్స్ నిర్మించేందుకు వీలుగా డ్వామా అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకై జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు,డిఆర్ఓలు అంచనాలు రూపొందించి పరిపాలనామోదం నిమిత్తం జిల్లా కలెక్టర్లకు సమర్పించాలని ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు,పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ నిధులు వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
పాస్టర్లకు,ఇమామ్లకు సకాలంలో గౌరవ వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కార్యదర్శి చంద్రుడు అధికారులను ఆదేశించారు.కోర్టు కేసులు విషయంలో ఎప్పటికప్పుడు సకాలంలో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.దీనిపై వక్ప్ బోర్డు ఒక నిర్ధిష్ట నమూనాను తయారు చేసి జిల్లా అధికారులకు పంపాలని చెప్పారు.జిల్లాకోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టుల్లో ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నవి,ఎన్ని కేసులు ఫైల్ చేయాల్సి ఉంది,ఎన్ని కేసులు క్లోజ్ అయిందనే వివరాలన్నీఆ ఫ్రోఫార్మా ద్వారా సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ కె శారదా దేవి, ఉప కార్యదర్శి రోజ్ లతా బాయి వక్ఫ్ బోర్డు సీఈఓ అలీమ్ భాషా, ఎండి ఆదామ్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …