-చిన్నారుల చిరు కోరిక తీర్చిన ముఖ్యమంత్రి
కాట్రేనికోన/అమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ పర్యటనలో భాగంగా ప్రజావేదిక వద్ద అదే గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు ముఖ్యమంత్రి ని కలిసి క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ కిట్ ఇప్పించవలసిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నారులను ఆప్యాయం గా పలుకరించి ..వెంటనే జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను చిన్నారులకు క్రికెట్ కిట్ అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చెయ్యేరు గ్రామ సర్పంచ్ చెల్లి సురేష్ ద్వారా చిన్నారులకు క్రికెట్ కిట్ ను అందజేశారు.కిట్ అందుకున్న చిన్నారులు సంతోషం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News