రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు వైఎస్ఆర్ – జగనన్న నగర్ గృహనిర్మాణ పథకం కింద 2,62,216 ఇళ్ల నిర్మాణం…

-88 పురపాలక సంఘాలలోని 177 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాం…
-టిడ్కో ఛైర్మన్ గా జె ప్రసన్న కుమార్ ప్రమాణ స్వీకారం
-రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు వైఎస్ఆర్ జగనన్న నగర్, గృహ నిర్మాణ పథకం కింద 88 పురపాలక సంఘాలలో 2,62,216 ఇళ్ల నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆడ్మినిస్ట్రేషన్ భవనంలో ఉన్న ఏపీ టిడ్కో రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపి టిడ్కో) ఛైర్మన్ గా జమ్మాన ప్రసన్నకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మాన ప్రసన్న కుమార్ చేత టిడ్కో ఛైర్మన్ గా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… పట్టణ పరిధిలో పేదలకు శాశ్వత గృహనిర్మాణం కల్పించాలని రాష్ట్రంలో దశల వారీగా అమలు చేస్తూ ప్రతి ఆరు నెలల కాలంలో 50 వేల ఇళ్లు చొప్పున పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం నూతన టెక్నాలజీతో ఇళ్లు నిర్మించాలని భావించినా అది ఆచరణలో సాధ్యం కాలేదని, విధాన పరంగా సరైన నిర్ణయాలు తీసుకోని కారణంగా టిడ్కో ఇళ్ల నిర్ణయం నత్తనడకన నడించిందని మంత్రి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయికే 300 చదరపు అడగుల ఇళ్లను నిర్మించి అన్ని మౌళిక సదుపాయలతో లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యం తో టిడ్కో పనిచేస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే అజెండాగా భావించి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, ఈ దశగా 88 మున్సిపాలిటీలలోనూ ఏపీ టిడ్కో ద్వారా జి ప్లస్ 3 పద్దతిలో ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో మొత్తం రూ. 21,167.86 కోట్లుతో 2,62,216 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టగా, వాటిలో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.3,933.24 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.12,644.34 కోట్లు మరియు లబ్ధిదారులు వాటా రూ.4,590.28 కోట్లతో ఇళ్ళ నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి అన్నారు. వైఎస్ఆర్ జగనన్న నగర్ ల కింది 88 పురపాలక సంఘాలలోని 177 కాలనీల్లో రోడ్లు, మురుగు కాల్వలు, మంచి నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, సామాజిక భవనము, ప్రాధమిక విద్యాకేంద్రం/అంగన్వాడి కేంద్రం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ఉద్యాన వనములు మరియు క్రీడా ప్రాంగణములు మొదలగు మౌలిక సదుపాలయాలు అభివృదిపరిచి లబ్దిదారులకు ఇళ్ల కేటాయింపు చేయనున్నామని మంత్రి చెప్పారు. రానున్న 2 సంవత్సరాల కాలంలో దశల వారీగా ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పూర్త చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపి టిడ్కో) ఛైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… పేద ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని టిడ్కో ఛైర్మన్ గా నాకు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞత తెలియచేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో టిడ్కో ద్వారా పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన నిరుపేదలకు గృహ నిర్మాణాలను చేపట్టి లబ్దిదారులకు అందజేస్తామని, ఇంత వరకు నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను త్వరతిగతిన పూర్తి చేసి ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేసి అందిస్తామని జె ప్రసన్న కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్సిపి నాయకులు దేవినేని అవినాష్, పాడేరు వైఎస్ఆర్సిపి నాయకులు శత్రుచర్ల పరీక్షిత రాజు, ఎపి టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ శ్రీధర్, జనరల్ మేనేజర్ హరినాథ్ బాబు, వివిధ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *