విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రిగోల్డ్ బాదితులకు చెల్లించాల్సిన డిపాజిట్స్ క్లయిమ్స్ సంబందించి డేటా వెరిఫికేషన్ ప్రక్రియ జరగుతుందని జాయింట్ కలెక్టరు(అభివృధ్ది) ఎల్. శివశంకర్ అన్నారు. శనివారం నగరంలోని కానూరు వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల లో అగ్రిగోల్డ్ బాధితులు బాండ్స్ ఇతర ధృపత్రాల వెరిఫికేషన్ ప్రక్రియను జాయింట్ కలెక్టరు శివశంకర్ ఏపీ సీఐడీ విభాగం అడిషినల్ ఎస్పీ రాజశేఖర్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ లో 20 వేల రూపాయల వరకు డిపాజిట్ చేసిన లబ్దిదారులు వాటికి సంబందించిన బాండ్స్ , బ్యాంక్ వివరములు, డిపాజిట్ రసీదులు మరియు ఇతర ధృవ పత్రాలను ఆన్ లైన్ లో పొందుపర్చారన్నారు. డిపాజిట్ దారులు ఆన్ లైన్ లో పొందుపర్చిన వారి యొక్క బాండ్స్ వివరాలను ఆన్ లైన్ ద్వారా వెరిఫికేషన్ చేపట్టామన్నారు. బెనిఫిషరీస్ డేటా ఎంట్రీ వెరిఫికేషన్ నిమిత్తం సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో 40 కంప్యూటర్లు ఏర్పాటు చేసి 80 మంది స్టాప్ ను నియమించామన్నారు. అవసరమైన అన్ని పత్రాలను, లబ్దిదారులను ఏపీ సీఐడీ డిపార్టుమెంట్ ధృవీకరించిన అనంతరం అర్హులైన క్లైయిమ్ దారులందరికీ సక్రమంగా చెల్లింపులు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సీఐడీ విభాగం అడిషినల్ ఎస్పీ రాజశేఖర్, డిఎస్పీలు జయసూర్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …