Breaking News

ప్ర‌తి కుటుంబం ముఖ్యం-మీ అభిప్రాయం మార్గ‌ద‌ర్శ‌నం

– ఈ నెల 20లోగా జ‌నాభా నిర్వ‌హ‌ణ విధానంపై ఆలోచ‌న‌లు పంచుకోండి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జ‌నాభా స‌మ‌తుల్య‌త ల‌క్ష్యంగా జ‌నాభా నిర్వ‌హ‌ణ విధానం (పాపులేష‌న్ మేనేజ్‌మెంట్ పాల‌సీ)పై రాష్ట్ర ప్ర‌భుత్వం కస‌ర‌త్తు చేస్తోంద‌ని.. విధాన రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేసేందుకు ప్ర‌ణాళిక శాఖ ద్వారా అభిప్రాయాలు సేక‌రిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తొమ్మిది ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి విలువైన అభిప్రాయాల‌ను ఈ నెల 20వ తేదీలోగా పంచుకోవాల‌ని కోరారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి కుటుంబ అభివృద్ధికి దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంద‌ని, రాష్ట్రంలో వేగంగా మారుతున్న జ‌నాభా మార్పుల‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక జ‌నాభా నిర్వ‌హ‌ణ విధానాన్ని రూపొందించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు వివ‌రించారు. మారుతున్న ప్ర‌జ‌ల అవ‌స‌రాలు, ఆశ‌యాల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక వ్యూహాలు, విధానాలు రూపొందించ‌డంపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాల‌ను పంచుకొని, రాష్ట్ర ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు నిర్మాణంలో భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *