రాష్ట్ర హైకోర్టులో జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎకె గోస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం నేలపాడులో గల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ముఖ్య అతిధిగా పాల్గొని పొలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం జరిగిన సభలో చీఫ్ జస్టిస్ గోస్వామి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య పోరాటంలో అశువులు బాసిన ప్రతి ఒక్కరికీ ఘణంగా నివాళులర్పించాల్సిన తరుణమిదని పేర్కొన్నారు.గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోందని గతంలో ఎన్నడూ చవిచూడని పరిస్థితి ఇదని చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి పేర్కొన్నారు.కోవిడ్ పరిస్థితుల కారణంగా న్యాయ స్థానాలు కూడా సక్రమంగా పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆపరిస్థితులను అధికమించి ఆన్లైన్ విధానంలో పనిచేసి కేసుల పరిష్కారానికి తద్వారా ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు అన్నివిధాలా కృషి చేయడం జరుగుతోందని చీఫ్ జస్టిస్ ఎకె గోస్వామి చెప్పారు.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ మనకు మనం పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఆంద్రప్రదేశ్ బార్ కొన్సిల్ అధ్యక్షులు జి.రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేళ స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.హైకోర్టు అడ్వకేట్ల సంఘం అధ్యక్షులు వైవి.రవి ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో అనేక మంది న్యాయవాదులు కూడా పాల్గొన్నారని తెలిపారు.స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ జాతికి పునరంకితం కావాల్సిన తరుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిష్ట్రార్లు, అదనపు సొలిసిటర్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, సిబ్బంది తదితురులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *