Breaking News

మచిలీపట్నం బీచ్ కు జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కృషి చేస్తా..

-వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ ఫుట్బాల్, పారా గ్లైడింగ్, హేలీ రేడింగ్ తో పాటు సందర్శకులకు కనువిందు చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, దేశంలో విభిన్న ఆహార పదార్థాలు ఒకేచోట లభ్యం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది..
-మసూల ఫెస్ట్ విజయవంతం చేయటంలో కృషి చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, సందర్శకులకు ధన్యవాదాలు..
-పారా గ్లైడింగ్ ఎక్కినప్పుడు బీచ్ అందాలు మరింత శోభాయమానంగా కనిపించాయి..
-బీచ్ లో రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారులు చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయం..
-ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడ తలెత్తకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు..
కొల్లు రవీంద్ర, గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగినపూడి బీచ్ ను దేశంలోనే ఒక గుర్తింపు గల బీచ్ గా తీర్చి దిద్దుతామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మసూల బీచ్ ఫెస్ట్-2025 వేడుకల్లో భాగంగా మూడవరోజు శనివారం మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. మంత్రి తో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులున్నారు. ముందుగా మంత్రి రవీంద్ర పారా గ్లైడింగ్ చేశారు.
అనంతరం మంత్రి రవీంద్ర మాట్లాడుతూ … మంగినపూడి బీచ్ లో మసులా ఫెస్ట్ -2025 కు సందర్శకులు విశేషంగా లక్షలాది ప్రజలు నిత్యం తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. బీచ్ ఫెస్టివల్ లో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్, పారా గ్లైడింగ్, హెలీ రైడింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. సాయంత్రం సమయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల ను వేలాదిగా తిలకించటం గర్వంగా ఉందన్నారు. పారా గ్లైడింగ్ అనుభవం ఎంతో బాగుందని, విహంగ వీక్షణం లో బీచ్ అందాలు మరింత శోభాయ మానం సంతరించుకున్నాయని తెలిపారు. బీచ్ లో రక్షణ ఏర్పాట్లపై అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు సైతం తలెత్తకుండా పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు బాగున్నాయన్నారు.
అనంతరం కయా కింగ్ పోటీలను మంత్రి రవీంద్ర తిలకించారు..
ఈ సందర్భంగా అర్జున అవార్డు గ్రహీత , కయా కింగ్ కోచ్ జయంత కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు.
కయా కింగ్ క్రీడాకారులకు మంత్రి చేతుల మీదుగా జెర్సీలను అందజేశారు. ఇకపై ప్రతి ఏడాది ఈ బీచ్ లో కయాకింగ్ తదితర వాటర్ స్పోర్ట్స్ ను నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జాతీయ అంతర్జాతీయ పోటీలను సైతం మంగినపూడి బీచ్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
బీచ్ లో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.. వైద్య శిబిరంలో అందుతున్న సేవలను గురించి తెలుసుకున్నారు.. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని సిబ్బందిని ప్రశ్నించారు.. వారు సమాధానం తో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

క్రీడ ప్రాధికార సంస్థ చైర్మన్ అని మిని రవి నాయుడు మాట్లాడుతూ..
రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పూర్వం నుంచి ఎంతో పేరున్న బీచ్ కు మరింత పేరు తీసుకువచ్చేలా బీచ్ స్పోర్ట్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని వారిలోని ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వాటర్ స్పోర్ట్స్ కు హబ్ గా మంగినపూడి బీచ్ ని తీర్చిదిద్దుతామన్నారు. బీచ్ వాలీబాల్, బీచ్ కబడి క్రీడల పట్ల ఇక్కడ ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదని అన్నారు.

రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు మాట్లాడుతూ..
గత ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే సంక్షేమ, అభివృద్ధి పై దృష్టి పెట్టడంతో మన రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. మంగినపూడి బీచ్ పేరు దేశమంతా మార్మోగిపోయేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. మచిలీ పట్నం నుండి బీచ్ వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని సందర్శకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *