Breaking News

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అమరజీవి పింగళి వెంకయ్య పేరుగా నామకరణం చేయాలి… : తమ్మిశెట్టి చక్రవర్తి 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మారుతీనగర్ లోని ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి ముందుగా డా.బి.ఆర్. అంబెడ్కర్, మహాత్మా గాంధీ, పూలే చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జండాని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనకి స్వాతంత్య్ర దినోత్సవం గత 75 సంవత్సరాలు జరుపుకోవడం ఎందరో మహానుభావులు త్యాగఫలం. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అనేక మంది యోధులు తమ ప్రాణాలని లెక్కచేయకుండా కృషితో స్వతంత్రాన్ని సాధించారు. కానీ నేటికి వారి కాలలు సాకారం కాలేదు. బ్రిటిష్ పాలన నుండి లభించిన స్వేచ్ఛకి ప్రతీ ఏటా ఈరోజు జాతీయ జండాను ఎగరవేయడం, త్యాగమూర్తులని, పోరాట యోధులని గుర్తుచేసుకుంటున్నాము. కానీ వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడంలో రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కృష్ణా జిల్లాకి చెందిన జాతీయ జెండా రూపకల్ప పింగళి వెంకయ్య గారి పేరుని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, సిటీ మహిళా అధ్యక్షురాలు దామర్ల సాంబ్రాజ్యం, బి.సి.నాయకులు టి.వెంకటేశ్వర్లు, కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరి, యూత్ లీలాకృష్ణ, జోసెఫ్, బ్రహ్మము, భాను, శంకర్, మహేష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సమస్యలపై గిరిజన సంఘాలతో త్వరలో ప్రభుత్వం చర్చలు

-గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యమిస్తాం…ఆందోళన పడకండి! -జీవో నెంబర్ 3 ప్రయోజనాలు దక్కేలా ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం -ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *