Breaking News

దశలవారీగా క్లీన్ ఎయిర్ జోన్ ప్రాజెక్టు అమలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై నెలలో విజయవాడ మరియు విశాఖపట్నంలోని కొన్ని నియోజకవర్గాలు, క్లీన్ ఎయిర్ జోన్ (Clean Air Zones – CAZ) ప్రాజెక్టు అమలుతో శ్వాసకి ఉపశమనం పొందే అవకాశముంది. ఈ కార్యక్రమం దశలవారీగా అమలుకాబోతుంది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాప్ ద్వారా ఈ దశలవారీ అమలు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ సంస్థలు, ట్రాన్స్‌పోర్ట్, పోలీస్ శాఖల అధికారులు పాల్గొనగా, Transport for London (TfL) సంస్థ నుండి సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ప్రాథమికంగా, విజయవాడలో రమేష్ హాస్పిటల్ జంక్షన్, సిద్ధార్థ కాలేజ్ జంక్షన్, విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ పరిసరాలు ఈ పథకం లబ్ధిదారులుగా ఎంపికయ్యాయి. “ఈ దశలవారీ విధానం ద్వారా ఈ ప్రాంతాల కోసం ప్రత్యేక పరిష్కారాలను రూపొందించి, నగరమంతా శుభ్రమైన గాలికి మార్గం సుగమం చేస్తుంది,” అని ఏపీపీసీబీ ఛైర్మన్ పి. కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దృష్టికోణం మేరకు, ఆరోగ్యకరమైన మరియు భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్న పట్టణాల ఏర్పాటులో భాగంగా రూపుదిద్దుకుంది అన్నారు. ఈ ప్రాజెక్టుకు అమలు పరంగా మార్గనిర్దేశనం అందిస్తున్నది ముంబయిలో ఉన్న అర్థ ఇండియా (Artha India) సంస్థ. సాంకేతిక సహకారం TfL (లండన్) మరియు TERI (ఢిల్లీ) సంస్థల నుండి లభిస్తోంది. “క్లీన్ ఎయిర్ జోన్‌లు విజయవంతంగా అమలవుతే, ప్రదేశిక కాలుష్య మోతాదులు తగ్గి గాలి నాణ్యత మెరుగవుతుంది. గత రెండు సంవత్సరాలుగా మేము సాంకేతిక సమాచారం సేకరించడమే కాకుండా, ట్రాఫిక్, ప్రజా రవాణా మెరుగుదల, చివరి దశ అనుసంధానాలు వంటి అంశాల్లో చురుకైన పరిష్కారాలను రూపొందించాం. క్లీన్ ఎయిర్ జోన్లలో పర్యావరణ హిత కాలీబాటలు ఏర్పాటు చేయడంతోపాటు స్థలం వున్న చోట మియావాకి అడవులను రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాము” అని తెలిపారు అర్థ ఇండియా సీఈఓ  ప్రితికా హింగోరానీ. “జూలై నుండి ప్రారంభమయ్యే కాలుష్య నియంత్రణ చర్యల్లో అన్ని స్టేక్‌హోల్డర్లు చురుకుగా పాల్గొనడం వల్ల, ఈ జోన్‌లు విజయవంతమవుతాయని నమ్మకం ఉంది. తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును దీర్ఘకాలికంగా కొనసాగించడానికి వ్యాపార సంస్థలను భాగస్వాములుగా చేయాలని కూడా ప్రయత్నిస్తున్నాం. ఈ చర్యలు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో స్వచ్ఛమైన గాలి కోసం వేగంగా ముందుకు వేసిన పటిష్టమైన అడుగులు. గాలి నాణ్యత, జీవన నాణ్యత రెండింటినీ మెరుగుపరచే దిశగా ఇది ఒక ప్రధాన మైలురాయి. ” అన్నారు GVMC ప్రాజెక్టు మేనేజర్ డా. స్వప్న కోటా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సమస్యలపై గిరిజన సంఘాలతో త్వరలో ప్రభుత్వం చర్చలు

-గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యమిస్తాం…ఆందోళన పడకండి! -జీవో నెంబర్ 3 ప్రయోజనాలు దక్కేలా ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం -ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *