Breaking News

రహదారులు అభివృద్ధికి చిహ్నాలు… : మంత్రి కొలుసు పార్ధసారధి

ఏలూరు/నూజివీడు/చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. బుధవారం జనార్దనవరం గ్రామంలో నాబార్డు నిధులు రూ. 2 కోట్లతో చేపట్టనున్న జనార్ధనవరం-తుమ్మగూడెం రహదారి పునర్నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరిగాయా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా రోడ్లు అభివృద్ధి పనులు జరిగాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సాధ్యమన్నారు. ఇప్పటికే ఉపాధి నిధులతో నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం చేసుకోవడం జరిగిందన్నారు. ఇంకా ఎక్కడైనా రోడ్లు అవసరమైన ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. నియోజకవర్గంలో సంక్షేమాభివృద్ధికి విద్యా, వైద్య రంగాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలకు మరింత చేరువుగా ఉండి సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్లుతున్నామన్నారు.

కార్యక్రమంలో పలువురు అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *