Breaking News

వత్సవాయి మండలం విస్తృతంగా పర్యటించిన సబ్ కలెక్టర్

విజయవాడ/ వత్సవాయి, నేటి పత్రిక ప్రజావార్త :
వత్సవాయి మండలం వత్సవాయి యంపియుపి పాఠశాలలో జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పుస్తకాలు తదితరాలతో కూడిన కిట్లను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అందజేశారు.
సోమవారం వత్సవాయి మండలంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విస్తృతంగా పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి రుచిచూశారు. అనంతరం స్వయంగా విద్యార్థులకు భోజనం అందజేశారు. అనంతరం తహాశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఫీవర్ సర్వే పై మండల నోడల్ అధికారులకు పలు సూచనలు చేశారు. సమగ్ర భూసర్వే నిర్వహణపై మండల డిప్యూటి సర్వేలకు సూచనలు ఇచ్చారు. అనంతరం నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు కార్యక్రమంపై సమీక్షిస్తూ ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. తదుపరి గ్రామసచివాలయాన్ని, ప్రాధామిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అనంతరం పోలంపల్లి గ్రామంలో రైతుభరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సబ్ కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ ఆలోచన ఎప్పుడూ జనసేన కార్యకర్తల సంక్షేమం… అభ్యున్నతి గురించే

-జన సైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుంది -రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలం చూపిస్తూ కూటమిని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *