-జగన్మోహన్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు
-నారా వారి నేరచరిత్ర తెలియనిదెవరికి..?
-వెన్నుపోటుకు పేటెంట్ రైట్ నీది కాదా..?
-మీ హయాంలో వందల మంది వైఎస్సార్ శ్రేణులను కిరాతకంగా హత్య చేసింది మర్చిపోయారా..?
-శవాలను పీక్కుతినే రాజకీయాలను ఇకనైనా మానుకో
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే చంద్రబాబుని మించిన క్రిమినల్ మరొకరు ఉండరని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష నేత చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, వెన్నుపోట్లు, హత్యా రాజకీయాలతో పైకి ఎదిగిన చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూర్చి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు చేసిన హత్యారాజకీయాలు అన్నీ ఇన్నీ కావని వ్యాఖ్యానించారు. నేరగాళ్ళు, ఖూనీకోరులు, దోపిడీదారులు, కరుడుగట్టిన క్రిమినల్స్ ను పెంచిపోషించి బీహార్ ని మించి రాష్ట్రంలో క్రైమ్ రేటును పెంచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. గత తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో నాడు రాక్షస పాలన నడిచిందని.. కానీ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నేడు సంక్షేమం, అభివృద్ధి మాత్రమే రాజ్యమేలుతున్నాయన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి గెంటేసిన దుర్గార్మపు వ్యక్తి చంద్రబాబు అని మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు ఒక వెన్నుపోటుదారుడని, అతడో ఆషాఢభూతి అని, ఔరంగజేబు అని సాక్షాత్తూ ఎన్టీఆర్ తన గుండెకోతను వివరించారని గుర్తుచేశారు. అంతేకాకుండా తన రాజకీయ భవిష్యత్ కు ఎక్కడ అడ్డువస్తాడనే భయంతో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి రాజకీయ సమాధి కట్టిన వ్యక్తి చంద్రబాబని మల్లాది విష్ణు అన్నారు. చివరకు మందబుద్ధి తనయుడి కోసం జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీకి దూరంగా పెడుతున్నాడని.. ఇంతటి పిరికిపంద దేశంలోనే మరొకరు ఉండరన్నారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా దీక్ష చేస్తున్న ప్రజానాయకులు వంగవీటి రంగాని నడిరోడ్డుపై హత్య చేసిన దుర్గార్గపు చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. చుండూరు, కారంచేడు ఎవరి హయాంలో జరిగాయో..? చంద్రబాబు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదన్నారు. వెన్నుపోటు, హత్యా రాజకీయాలకు పేటెంట్ ఎప్పటికీ చంద్రబాబుదేనని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో వందల మంది వైఎస్సార్ సీపీ శ్రేణులను అత్యంత కిరాతకంగా హతమార్చారన్నారు. ఇంతటి హీనమైన నేరచరిత్ర కలిగిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి గూర్చి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. చివరకు ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ నుంచి కరకట్టకు పారిపోయిన దొంగకు.. జగన్మోహన్ రెడ్డి గూర్చి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న శవరాజకీయాలను చంద్రబాబు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
Prajavartha Online Telugu News