Breaking News

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా మిన్నగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి  రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 24వ డివిజన్ లోని గిరిపురం వీధులలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి ఆయన పర్యటించారు. గడప గడపకూ తిరిగి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యంపై ఎక్కువ ఫిర్యాదులు అందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని.. లేకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని సిబ్బందిని హెచ్చరించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్ స్పెక్టర్ నిరంతరం పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. డివిజన్ లోని ప్రమాదకర మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్వర్టులపై పగుళ్లిచ్చిన శ్లాబులను తక్షణమే మార్చాలని.. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అనంతరం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.. విదేశాలకు వెళ్లే పౌరులకు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.

అనంతరం మల్లాది విష్ణు  విలేకర్లతో మాట్లాడుతూ గత తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో విజయవాడలో అభివృద్ధి పనులన్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారయ్యాయని అన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లోనే నగరంలో రూ. 600 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఒక్క 24వ డివిజన్ లోనే రూ. 4.60 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలియజేశారు. చంద్రబాబునాయుడు పెద్ద అవకాశవాది అని.. 600 కి పైగా హామీలను ఇచ్చి చివరకు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి  నవరత్నాల పథకాలతో ప్రజల అవసరాలన్నింటినీ తీర్చారన్నారు. నగరంలో అద్దెదారులనేవారు ఉండకూడదని.. విజయవాడ వ్యాప్తంగా 97వేల మందికి జగనన్న కాలనీల రూపంలో శాశ్వత చిరునామా కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి  అని కొనియాడారు. గత ముఖ్యమంత్రి సీఎం పీఠాన్ని హోదాగా భావిస్తే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఒక బాధ్యతగా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ కొమ్ము చంటి, బొంగరాల భాస్కర్ రావు, ఇస్సాక్, మనోహర్, రెడ్డి, కాజా శంకర్, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *