Breaking News

ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే నాలుగేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ లో జిల్లాలో గృహ నిర్మాణ పథకం అమలు తీరుపై జిల్లా కలెక్టర్ హౌసింగ్, విద్యుత్ ,ఆర్డబ్ల్యూఎస్ ,పంచాయతీ రాజ్, కాంట్రాక్టర్లు ,ప్రజా ప్రతినిధులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గాల వారీగా లేఅవుట్ల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతిస్తున్నదని, లేఅవుట్లపై ప్రభుత్వం ఇప్పటికీ కోట్లాది రూపాయలకు ఖర్చు చేసిందని ,హౌసింగ్ అధికారులు గృహ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి పెట్టి పేదల కు నివాసయోగ్యం చేయాలన్నారు. లేఅవుట్ల మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, ముందుగా విద్యుత్, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. త్రాగునీటి అవసరాల కోసం జీవీఎంసీ నుండి నిధులతోపాటు ప్రభుత్వం నుండి కూడా నిధులు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పనులు మొదలైన వాటిని 100 శాతం పూర్తి చేయాలని,గ్రౌండ్ కానీ పనులను ప్రారంభించవద్దన్నారు.లేఔట్లు పూర్తి చేయడానికి స్థానిక శాసనసభ్యులు ,ప్రజాప్రతినిదూల సహకారం తీసుకోవాలన్నారు. గతంలో అనర్హులకు ఇచ్చినట్లయితే వారిని తొలగించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ళ నాణ్యత పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, తూతూ మంత్రంగా కాకుండా నాణ్యత ప్రమాణాలతో ఉండే విధంగా నిర్మిచాలన్నారు. నిర్మాణంలో ప్రగతి చూపని కాంట్రాక్టర్లకు ,హెచ్చరికలు జారీ చేయాలని, అప్పటికి ఇళ్ళ నిర్మాణం వేగవంతం చేయకపోతే తొలగించడానికి వెనుకాడ వద్దన్నారు. కాంట్రాక్టర్లకు ఎక్సెస్ పేమెంట్ చేసినట్లయితే అధికారులను బాధ్యులను చేయడం జరుగుతుందన్నారు. హౌసింగ్ అధికారులు రోజువారి టార్గెట్ నిర్ధారించుకుని ఈ సంవత్సరం చివరికి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. లేఔట్ లో మిగిలిపోయి ఉన్న వాటిని రీ లే ఔట్ చేసి ప్రభుత్వం ప్రకటించినట్లు అర్బన్ లో రెండు సెంట్లు మూడు సెంట్లు గా ఇస్తామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పేదల గృహ నిర్మాణ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా పనుల వివరాలను డిఇలను కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
హుదూద్ తుఫాన్లు లబ్ధిదారుల కు అప్పటి జాబితా ప్రకారమే హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయాలన్నారు. ముదపాక లే ఔట్ కోర్టు కేసు ను జిల్లా కలెక్టర్,స్తానిక MLA రైతులతో మాట్లాడి పరిష్కరించాలన్నారు.పలు లే అవుట్ లలో అసంపూర్తి గా ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు.

జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ లేఅవుట్లలో తాగునీటి కోసం జీవీఎంసీ కౌన్సిల్లో ఆమోదం తీసుకుని మొదటి దశలో 20 కోట్లు అంద చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నుండి కూడా కొన్ని నిధులు మంజూరు చేయించాలని మంత్రిని కోరారు. ప్రతిరోజు టార్గెట్ నిర్ధారించుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని క్రమబద్ధంగా సమీక్షలు కూడా చేస్తున్నామని, గత మూడు నెలలుగా జిల్లాలో ఇళ్ల నిర్మాణం వేగవంతమైందని అన్నారు. మార్చి 2026 లోగా నూరు శాతం పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ త్రాగునీటి సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని, కాంట్రాక్టర్లు టాయిలెట్ పిట్ ఏర్పాటు చేసినట్లయితే లబ్ధిదారు ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ హౌసింగ్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, పనిచేయని కాంట్రాక్టర్లను తొలగించాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బి.తాతబ్బాయి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ భవాని శంకర్, ఆర్డిఓ, సంగీత్ హౌసింగ్ సీఈ రామ్మోహన్రావు, హౌసింగ్ పీడీ సత్తిబాబు, సంబంధిత హౌసింగ్ ఈలు డిఈలు పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *