అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మొహర్రం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 1341 ద్వారా ఆదేశాలు జారీ చేశారు.వాస్తవానికి ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 19వతేది గురువారం మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినమైన్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆసెలవు దినాన్ని ఈనెల 20వతేది శుక్రవారానికి మార్పు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొహర్రం సెలవు దినాన్ని 19వతేదీ గురువారానికి బదులుగా 20వతేదీ శుక్రవారానికి మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈనెల 20వతేదీ మొహర్రం సందర్భంగా రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, వివిధ స్థానిక సంస్థలకు ఈసెలవు దినం వర్తిస్తుంది. అదే విధంగా నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం వివిధ బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు మొదలైన వాటికి కూడా ఈసెలవు దినం వర్తిస్తుందని గతంలోనే ప్రకటించినందున వాటికి కూడా ఈసెలవు దినం వర్తిస్తుంది.
