దేశం కోసం చివరి వరకు పాటుపడతాం… : మాజీ సైనికులు మోటూరి శంకరరావు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లోని మార్చ్‌ఫాస్ట్‌లో 65 సంవత్సరాల మాజీ సైనికులు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్‌ మోటూరి శంకరరావు బృందం పాల్గొనడం అభినందనీయం. ఇటువంటి సీనియర్లు, మాజీ సైనికులు దేశానికి ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచనతో జీవిత చరమాంకం వరకు దేశం కోసం పాటుపడాలని తపన వుంది అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటీకీ మోటూరి శంకరరావు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా ఓ అసోసియేషన్‌ స్థాపించి మాజీ సైనికులు కోసం వారికి ఉపాధి కల్పించి చేయూత నిచ్చే ఉద్దేశ్యంతో ఇప్పటికీ పాటుపడుతున్నారు. ఈ సందర్బంగా మోటూరి శంకరరావు మాట్లాడుతూ ఇంకా దేశం కోసం ఏదో చేయాలనే ఆశ వుందని, దీనికి వయస్సు, పదవితో సంబంధం లేదని ప్రతి పౌరుడు ఒక సైనికుడేనని అన్నారు. కాబట్టి అవసరమైనపుడు ప్రతి పౌరుడు దేశం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. డ్రిల్‌లో డ్రమ్స్‌ మోత వింటుంటే రక్తం ఉప్పొంగుతుందన్నారు. ఇలాంటి వారు ఎంతో మంది మన రాష్ట్రంలో కళ్ళ ఎదుట వున్నా కూడా తెలియని పరిస్థితి ఇప్పటిది. ఇటువంటి వారు గతంలో దేశం కోసం కుటుంబాన్ని వీడి రాత్రిపగలు దేశాన్ని కాపాడటం వలనే మనం మన:శాంతితో ఇప్పుడు అనుభవిస్తున్న ఇప్పటి సమాజం. ఇటువంటి వారి త్యాగాలు మరువలేనివి. ఇటువంటి దేశభక్తులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. జైహింద్‌…జై జవాన్‌…జై ఇండియా…జై భారత్‌మాత…

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *