Breaking News

కార్మిక వర్గ సత్తా చాటుదాం…

-జులై 9 సమ్మెను విజయవంతం చేద్దాం
-ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల పిలుపు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశివ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుని విజయవంతం చేద్దామని రాష్ట్ర కార్మిక ఉద్యోగ ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. మేరకు మంగళవారం బాలోత్సవ భవన్ లో రాష్ట్ర ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల, రైతుల, వ్యవసాయ కూలీ చేతివృత్తుల. మహిళా యువజన విద్యార్థి రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. నాలుగు లేపన కోడ్లకు వ్యతిరేకంగా, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, 10 గంటల పని విధానాన్ని, అధిక గంటల పని విధానాన్ని, రాత్రి సమయంలో మహిళల పని చేయు విధానాన్ని తీవ్రంగా సంఘాలు వ్యతిరేకించాయి. వ్యవసాయ రంగంలో నూతన మార్కెట్ విధానాన్ని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని, రుణాల రద్దు చేయాలని, రైతులకు అన్ని వేదాల సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలు కూడా కార్మిక చట్టాలు వర్తింపజేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని 800 రూపాయల కూలి ఇవ్వాలని రోజుకి డిమాండ్ చేశారు. చేతి వృత్తుల అందర్నీ ఆదుకోవాలని రుణాలు కల్పించాలని కోరారు. విద్యుత్ సంస్కరణ రద్దు చేయాలని, స్మార్ట్ మీట్లని బిగించకూడదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కరెంటు చార్జీలు పెంపుతున్న తీవ్రంగా వ్యతిరేకించారు. మల్లెకి వందనం అర్హులైన వారందరికీ ఇవ్వాలని మరోసారి సర్వే చేసి గుర్తించి అందరికీ అందించాలని కోరారు. కేంద్రంలో రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్లకు వ్యతిరేకంగా, బిజెపి దాని అనుబంధ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం చెత్త చాటేందుకు జూలై 9 జరిగే సమ్మె ఒక మచ్చు తొనకగా నిలబడాలే తమ బలం చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రాంపల్లి రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళా నాయకులు వెంకట సుబ్బారావమ్మ, ఏఐటిసి డిప్యూటీ కార్యదర్శి వెంకటసుబ్బయ్య, వ్యవసాయ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు జల్లి విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు వైకేశవరావు, పి జమలయ్య, ఎలమందరావు, వైయస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు గౌతమ్ రెడ్డి, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే పోలారి, ఏసిటియు రాష్ట్ర అధ్యక్షులు కే సుధీర్, విద్యార్థి నాయకులు రవిచంద్ర, లంక గోవిందరాజులు, ప్రసన్న, రాజేష్, మహిళా సంఘం నాయకులు పద్మావతి, టియుసి ఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *