-విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కార్పొరేటర్ రెహమతున్నిసా, శిరంశెట్టి పూర్ణచంద్రరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయం నందు మంగళవారం నాడు మాజి మంత్రివర్యులు, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన పశ్చిమ వైసిపి కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమతున్నిసా, 55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు లను పశ్చిమ వైసిపి కార్పొరేటర్లందరు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పశ్చిమ వైసిపి కార్పొరేటర్లందరు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News