-ఉదయం 8 గంటలకే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను ఆప్యాతగా పలకరిస్తూ యోగ క్షామాలు తెలుసు కొంటూ పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి
-ఆగిరపల్లి మండలంలో 9425 మందికి గాను, సుమారు, రూ,4,12,9,950,కోట్ల పింఛన్లు పంపిణీ
ఆగిరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లో సచివాలయ సిబ్బంది తో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి కొలుసు పార్థసారథి. స్వయంగా కొందరు లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్లి మంత్రి పింఛన్ సొమ్ము అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పకుండా పెన్షన్ పెంచి అందచేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది కి ప్రతీ నెల 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఆగిరపల్లి మండలం చొప్పర మెట్ల గ్రామంలో ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయతగా పలకరిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పెన్షన్ మొత్తాన్ని 2 వేల నుండి 3 వేల రూపాయలకు పెంచడానికి గత ప్రభుత్వానికి 5 సంవత్సరాల సమయం పడితే తాము 10 రోజుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచామన్నారు. ప్రతీ నెల మొదటి తేదీనే మొత్తం పెన్షనర్ల అందరికి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందించడం జరుగుతుందని, ఆ సమయంలో ఇంట్లో లేని వారికి 2వ తేదీన పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ఆగిరపల్లి
మండలంలో 9,425 మందికి గాను రూ.4,12,9,950,కోట్ల అందిస్తున్న ప్రభుత్వం మాది అన్నారు. 1 తేది ఆదివారం వస్తే ఒకరోజు ముందే భారత దేశంలో ముందుగా పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ప్రజలందరూ కూటమి సభ్యులతో చారిత్రాత్మక విజయాన్ని అందించారని, ఆ విజయాన్ని బాధ్యతగా భావించి ప్రజల ఆకాంక్షల మేరకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసినప్పడికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వ మాది అన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్న 1 తేది ఉదయం 5 గంటలకే వృద్దప్య పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం మాది అన్నారు రానున్న 5 సంవత్సరాల్లో చింతలపూడి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నియోజకవర్గ ప్రజల త్రాగు సాగు నీటి సమస్యను తీరుస్తామని ఇల్లు లేని ప్రతీ నిరుపేదలకు రానున్న 5 ఏళ్లలో పక్కా ఇళ్లు కట్టించే భాద్యత కూటమి ప్రభుత్వానిదని అన్నారు పేదవాడికి ఏ సమస్య వచ్చినా నేరుగా నా దగ్గరకు వచ్చి పని చేయించుకోచ్చని మధ్యవర్తిత్వం దళారీలకు తావులేదని తెలిపారు. మండలంలో భూ సమస్యల పరిష్కారానికి ఆర్డీఓ లతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తానని మండలంలో భూ సమస్యలు చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. వీటి కోసం జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ లతో ప్రత్యేక వేదిక ఏర్పాటుచేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆగిరపల్లి మండలంలో డ్రైనేజ్, రోడ్ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని మంత్రి చెప్పారు.శోభనాశల స్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి వెంట మండల అభివృద్ధి అధికారి,ఇతర ప్రభుత్వ అధికారులు , తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News