
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. వరలక్ష్మీ దేవి గా అమ్మవారు దర్శనం ఇచ్చారు. లక్ష్మీ దేవి గా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు అన్నారు. అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు. శ్రావణమాసం మూడవ శుక్రవారం అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన లక్ష కుంకుమార్చన సేవలో సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి భక్తులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News