Breaking News

రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పనితీరుకు పోలీస్ శాఖ సాధించిన పతకాలే నిదర్శనం…

-పోలీస్ క్వార్టర్స్, పోలీస్ భవనాల నిర్మాణంతో పాటు గతంలో నిర్మించిన భవనాల అభివృద్ధి…
-రాష్ట్ర హోంశాఖామాత్యులు మేకతోటి సుచరిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం నిరంతరం సేవలు అందిస్తున్నదని ఇందుకు పోలీస్ శాఖ సాధించిన పతకాలే నిదర్శనమని రాష్ట్ర హోం శాఖామాత్యులు శ్రీమతి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమితులైన మెట్టుకూరు చిరంజీవ రెడ్డి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో హోమ్ శాఖామాత్యులు శ్రీమతి మేకతోటి సుచరిత సమక్షంలో నియామక పత్రంపై సంతకం చేసి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థను మెరుగుపరిచి మౌలిక వసతులను కల్పించడం ద్వారా పోలీలు ప్రజలకు రక్షణకవచంగా నిలిచి శాంతిభద్రతలను కాపాడడంలో ప్రత్యేక దృష్టి తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర పోలీస్లు ప్రజలకు అందిస్తున్న సేవానిరతి, శాంతిభద్రతలు కాపాడడంలో చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుండి అనేక ప్రశంపలను పతకాలను సాధిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ఆలోచనా విధానాలకు అనుగుణంగా పోలీస్ శాఖ ప్రజలందరికీ రక్షణ కల్పించడంతో పాటు ముఖ్యంగా మహిళలు, బాలికలకు ఎటువంటి ఆపద ఏర్పడినా తక్షణమే రక్షణ హస్తం వారివద్దకు వెళ్లేలా దిశాయాప్ను ముఖ్యమంత్రి రాష్ట్రంలో అమల్లోకి తీసుకువచ్చారని ఆమె అన్నారు. దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేసి మహిళలకు, బాలికలకు ఎటువంటి ఆపద కలిగినా నిమిషాల్లో వారి వద్దకు చేరి రకషత కల్పించే అధునాతనమైన సాంకేతిక వ్యవస్థతో కూడిన పోలీస్ వ్యవస్థను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని ఆమె అన్నారు. గతంలో పోలీస్ లకు నిర్మించిన గృహసముదాయాలను శిధిలావస్థకు చేరుకున్నాయన్నారు. గత ప్రభుత్వం పోలీస్ గృహనిర్మాణాల అభివృద్ధి పై నిర్లక్ష్యం వహించడం జరిగిందన్నారు. పూర్వం నిర్మించిన గృహసముదాయాలతో పాటు విద్య, పశుసంవర్థక, వ్యవసాయ తదితర శాఖలకు చెందిన నూతన భవన నిర్మాణాలు పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పోరేషన్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన చిరంజీవ రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచనా విధానాలకు అనుగుణంగా సేవలు అందించి కార్పోరేషన్ కు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని హోమ్ మంత్రి సుచరిత అన్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సేవాభావంతో పనిచేసే ప్రతీ ఒక్కరికీ మంచి అవకాశాలు లభిస్తాయనేందుకు నిదర్శనమే చిరంజీవ రెడ్డి నియామకం అన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. 137 కార్పోరేషన్లకు సమర్ధవంతులైన ఛైర్మన్లను నియమించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే ఆయన ఉద్దేశ్యమన్నారు. అనుభవజ్ఞుడైన చిరంజీవ రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ స్థితిగతులను మార్పు చేయడంలో కృతకృత్యులవుతారనే దానిలో సందేహం లేదని మంత్రి అనీల్ కుమార్ యాదద్ తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్  మెట్టుకూరు చిరంజీవ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించడంపట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు సేవలు అందించుటలో, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ను ప్రగతిపథంలో నడిపించుటలో జగన్మోహన రెడ్డి గారి ఆలోచనా విధానాలకు అనుగుణంగా పనిచేస్తానని చిరంజీవ రెడ్డి అన్నారు. పోలీస్ క్వార్టర్స్, పోలీస్ కార్యాలయ భవనాల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని, నిర్మాణదశలో ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నామని ఆయన అన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తానని ఛైర్మన్ యం. చిరంజీవ రెడ్డి అన్నారు.
పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు యన్. పంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఛైర్మన్ గా మెట్టుకూరు చిరంజీవ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టడం శుభపరిణామం అన్నారు. కార్పోరేషన్ ద్వారా గత రెండేళ్లలో త్రిపుల్ ఐటి భవనాలు, వెటర్నిటీ భవనాలు, స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీ భవనాలతో పాటు 147 అగ్రిల్యాబ్స్ భవన నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. గతంలో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ కు మరమ్మత్తులు చేసి అభివృద్ధి చేయనున్నామన్నారు. నూతన భవనాల నిర్మాణాలలో పనుల నాణ్యత పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాపరెడ్డి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, ఏపి టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ వరప్రసాద రెడ్డి, మైనారిటి కార్పోరేషన్ ఛైర్మన్ ఆసిఫ్, కావలి ఎఎంసి చైర్మన్ సుకుమార రెడ్డి, నెల్లూరు జిల్లా నాయకులు యం. కేశవ రెడ్డి, యం. వెంకట రెడ్డి, విజయకుమార్, బాలగురవారెడ్డి, ఏపి పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ యల్. సీతారామరాజు, చీఫ్ ఇంజినీర్ వేణుగోపాల్ రాజు, తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సామాజిక భద్రతలో ఏపీ దేశానికే ఆదర్శం

-సంక్షేమం–అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి -క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి: దేవినేని ఉమా మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *