సహాయక చర్యలను పర్యవేక్షించిన అవినాష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని APIIC కాలనీ నందు శనివారం భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం 4వ డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకువెళ్లగా హుటాహుటిన సంబంధిత అధికారులతో కలిసి వెంటనే ఆ ప్రాంతంలో పర్యటించిన అవినాష్ బొరేవెల్ సిస్టమ్ , జెట్ మోటర్లు ఏర్పాటు చేసి నీటిని తోడే చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వైస్సార్సీపీ నాయకులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని, అంటురోగాలు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే స్థానిక నాయకుల దృష్టికి గాని, తన దృష్టికి గాని తీసుకురావలన్ని సూచించారు. ఈ కార్యక్రమంలో గల్లా రవి, పాతురి సాంబశివరావు, రాంబాబు, షోకొత్ అలీ, బొడ్డు తరుణ్, రషీద్, బాబుబై తదితరులు పాల్గొన్నారు

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *