Breaking News

కూటమి ప్రభుత్వంలో పేదలకు మేలు జరుగుతుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా

-వినికిడి సమస్య ఉన్న తమకు సహాయం అందించినందుకు MLA బొండా ఉమకి కృతజ్ఞతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం 60వ డివిజన్ వాంబే కాలనీ కి చెందిన అన్నలదేసి కృష్ణవేణి, చిన్నబోయిన షారోన్ బ్లేస్సి, గరిటాడ పార్వతి లకు నిన్న సాయంత్రం “సుపరిపాలనకు తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమమహేశ్వరరావు  ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజాభిప్రాయం సేకరిస్తు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సమయంలో వినికిడి సమస్యతో బాధపడుతున్న వారికి తక్షణమే ఒక గంట వ్యవధిలో వినికిడి యంత్రాలను తన సొంత నిధులతో తెప్పించి అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వినికిడి సమస్య ఉన్నవారు మాట్లాడుతూ 2024 లో NDA కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందనే నమ్మకంతో సెంట్రల్ నియోజకవర్గంలో  MLA బొండా ఉమా ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నామని, ఎన్నో సంవత్సరాలుగా తమకు ఆర్థిక స్తోమత లేక వినికిడి యంత్రాలను వాడటం లేదని, MLA గారు నిన్న పాదయాత్రలో తమ ఇంటి వద్దకే వచ్చి తమ సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రజలకు కావలసినటువంటి రోడ్లు, కాలువలోని మురికి శుభ్రం చేయడం వంటి మంచి పనులు దగ్గరుండి చేపిస్తున్నారని, పెన్షన్లు లేనివారికి తక్షణమే పెన్షన్లు మంజూరు చేపించిన గొప్ప నాయకులు ఎమ్మెల్యే అని, వెంటనే స్పందించి తమ ఇబ్బందిని గుర్తించి బాధితులకు సహాయం అందించిన MLA బొండా ఉమ కి కూటమి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఘంటా కృష్ణమోహన్, కంచి ధనశేఖర్, రామరాజు, ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *