Breaking News

మొహారం పండుగ సందర్బంగా పీర్ల వేడుకలకు ముఖ్య అతిధిగా షేక్ ఖలీఫా తుల్లా బాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం జిల్లా లోని దర్శి నియోజగవర్గం గంగపాలెం గ్రామములో జరిగిన మొహారం పండుగ సందర్బంగా పీర్ల వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న “ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ”ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా కి మరియు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ మీరవలీ లకు ఘనంగా స్వాగతం పలికిన గ్రామ ముస్లిం పెద్దలు. ఈ సందర్బంగా“ పీర్ల పంజాలకు ”ఘనంగా (ప్రార్ధన)పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదన కార్యక్రమం లోపాల్గొన్న ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా చేతుల మీదుగా భక్తులకు అన్నదనం చేశారు. ఆ గ్రామ విశిష్టత చూస్తే ఆ గ్రామం లో మొత్తం 150 కుటుంభలకు 100 కుటుంభలు డాక్టర్లు ఉన్నారు. ప్రతి సంవత్సరం మొహారం పండుగకు అందరూ గ్రామానికి వచ్చి ఒక కుటుంభం లా మొహారం పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమం లో పఠాన్ సాజిద్ ఖాన్, సయ్యద్ కరీముల్లా, డాక్టర్ SM వలీ, డాక్టర్ సయ్యద్ ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *