సీపీఎస్ విధానాన్ని రద్దు చెయ్యాలి… : యం.రాజుబాబు


-సిపియస్ ఉద్యోగుల ఆందోళనకు రవాణాశాఖ ఉద్యోగుల మద్దతు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపియస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతినే కొనసాగించాలని కోరుతూ ఫ్యాప్టో సిపియస్ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరు 1వ తేదీన నిర్వహించే నిరశన ర్యాలీ, బహిరంగసభకు రవాణాశాఖ ఉద్యోగుల పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్లు జోనల్ అధ్యక్షులు యం.రాజుబాబు తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీన సిపియస్ ఉద్యోగులు చేపట్టనున్న నిరశన ప్రదర్శనకు మద్దతుగా రవాణాశాఖ కార్యాలయ ఆవరణలో సోమవారం రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు యం. రాజుబాబు ఆధ్వర్యంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ సిపియస్ విధానాన్ని రద్దు చేయాలని సెప్టెంబరు 1వతేదీన సిపియస్ ఉద్యోగులు నిర్వహించే నిరశన ప్రదర్శనకు ఏపి ఎన్జీఓస్ అసోసియేషన్ ఇప్పటికే సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగిందన్నారు. సిపియస్ విధానం అమలు చేయడం వలన రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. పదవీ విరమణ చేసినాక పెన్షన్ రాదనే భాదతోనే అనారోగ్యాలపాలు అవుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం లోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తారనే పూర్తి విశ్వాసంతో ఉద్యోగులు ఉన్నారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి యం దాసు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో సిపియస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన హామీను అమలుపరిచి సిపియస్ విధానాన్ని పూర్తిగా రద్దుచేసి సిపియస్ ఉద్యోగులు వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపుతారని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. గత ఏడాది కాలం పైగా కరోనా వ్యాధి విస్తరించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఉద్యోగులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి అండగా ఉంటున్నారన్నారు. సిపియస్ విధానాన్ని రద్దుచేయాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ట్రాన్స్ పోర్టు ఉద్యోగుల మద్దతు తెలిపినట్లు తెలియజేసారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *