Breaking News

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు జగన్మోహన్ రెడ్డి బాసటగా నిలిచారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-రాష్ట్రంలో ఉంది నకిలీ తెలుగుదేశం పార్టీ…
-అగ్రిగోల్డ్‌ స్కాంకు కర్త, కర్మ, క్రియ గత చంద్రబాబు ప్రభుత్వమే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉన్నది నకిలీ తెలుగుదేశం పార్టీ అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ లోని భగత్ సింగ్ నగర్ రోడ్డు, పెనుమత్స వారి వీధి, వానపల్లి వారి వీధులలో స్థానిక కార్పొరేటర్  పెనుమత్స శిరీష సత్యం తో కలిసి ఆయన పర్యటించారు. అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ముత్యాలంపాడు దోబీఘాట్ ను పరిశీలించిన ఆయన.. అక్కడి పరసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకముందే పరిసరాలను పరిశుభ్రపరచాలన్నారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతన పాలనను అందించడంలో భాగంగా చేపట్టిన గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమాన్ని విమర్శించే వారికి ప్రజాక్షేత్రంలో ఉండే నైతిక అర్హత లేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే  మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఆర్థిక నేరాల ద్వారా మోసపోయిన ప్రజలను ఆదుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మాత్రమేనని చెప్పుకొచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 905.57 కోట్లు నేరుగా వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. సీఐడీ, వాలంటీర్ల వ్యవస్థల సమన్వయంతో పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. గత తెలుగుదేశం హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నిందన్నారు. వాటిని సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీలో చూపించామన్నారు. అగ్రిగోల్డ్ అక్రమాలకు కర్త, కర్మ, క్రియ ముమ్మాటికీ చంద్రబాబునాయుడేనని మల్లాది విష్ణు విమర్శించారు. ఆయన హయాంలోనే అగ్రిగోల్డ్‌ కనీసం సెబీ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఫిబ్రవరి 17, 2019న జీఓ ఇచ్చారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం న్యాయస్థానం పర్యవేక్షణలో అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి.. బాధితులకు న్యాయం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా బాధపడకూడదని మానవీయ కోణంలో ఆలోచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మల్లాది విష్ణు  అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడటమే ఇందుకు నిదర్శనమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న రోజుగా నేడు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మరోవైపు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి చంద్రబాబునాయుడు గెంటేసిన రోజు కూడా ఇదే రోజని మల్లాది విష్ణు  గుర్తుచేశారు. వెన్నుపోటుకు పేటెంట్ రైట్స్ పొందిన రోజైనా.. చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి  చేపట్టే ప్రజారంజక కార్యక్రమాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఈ నకిలీ తెలుగుదేశం పార్టీని రాజకీయాల నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అనూష అనే మహిళకు మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, వీఎంసీ ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, వైఎస్సార్ సీపీ నాయకులు సామంతపూడి చిన్నా, పట్టాభి, వెంకటేశ్వరరావు, అంగిరేకుల విజయ్, అంగిరేకుల సాయి, బెజ్జం రవి, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *