యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు విజయవాడలో 4 పరీక్ష కేంద్రాలు… : కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అర్గనైజేషన్లో ఉద్యోగాల నియామకానికి సెప్టెంబరు 5న (ఆదివారం) నిర్వహించే పరీక్షలకు సంబంధించి సెన్సిటివ్ మెటీరియలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ జె. నివాస్ స్వయంగా పర్యవేక్షించారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అర్గనైజేషన్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ / ఎకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి సెప్టెంబరు 5వ తేదీ ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు విజయవాడలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి సెన్సిటివ్ మెటీరియల్ మంగళవారం గన్నవరం విమానాశ్రయం చేరుకోగా అక్కడ నుంచి పోస్టల్ డిపార్టుమెంట్ వారు విజయవాడ అర్బన్ తహాశీల్దార్ కార్యాలయానికి చేరవేశారు. ఈ నేపథ్యంలో వాటిని పరిశీలించి, స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే ప్రక్రియను కలెక్టర్ జె. నివాస్ పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి వి. శ్రీనివాస్, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్యామ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *