-అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచిన సియం జగన్మోహన రెడ్డి…
-రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రిగోల్డ్ బాధితులకు మంచి జరగాలని మనసారా కోరుకుని ముఖ్యమంత్రి గా. వై.యస్. జగన్మోహన రెడ్డి చెప్పిన మాట ప్రకారం అర్హులైన 10.40 లక్షలమంది బాధితులందరికీ రూ.905.57 కోట్లు చెల్లించారని రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాపరావు చెప్పారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి అగ్రిగోల్లో డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం రెండవ విడతగా రూ. 10 వేల మంచి రూ. 20 వేల రూపాయలు డిపాజిట్ చేసిన డిపాజిట్ దారులకు రెండవ విడత చెల్లింపులను బటన్ నొక్కి ఆన్ లైన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి విడుదల చేశారు.
ఈవీడియోకాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టరు జె. నివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణువర్ధన్, B. రక్షణనిధి, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, వడ్డీలు కార్పోరేషన్ చైర్మన్ యస్. గాయత్రి, బట్రాజుల కార్పోరేషన్ చైర్మన్ గీతాంజలి, జడ్ పి పిఇఓ పియస్. సూర్యప్రకాష్, జిల్లా పంచాయతి అధికారి ఎం. జ్యోతి యంపిడిఒ సునీత, అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్రిగోలో డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి తన పాదయాత్రలో, మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు డిపాజిట్ దారులకు నగదు చెల్లింపులో భాగంగా ఇంతవరకూ రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన మోసపోయిన 3.86 లక్షల మంది డిపాజిట్‌దారులకు రూ. 207.61 కోట్లు, రూ. 10 వేల నుంచి రూ. 20 వేల లోపు డిపాజిట్ చేసి మోసపోయిన సుమారు 3.14 లక్షలమంది బాధితులకు రూ. 459.23 కోట్లు హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షలమంది అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి వాటిని సిఐడి ద్వారా నిర్ధారించి రూ.666.84 కోట్లను ఈరోజు అందించడం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టరు కె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులైన 91 వేల 589 మంది డిపాజిట్ దారులకు 82,46,86,728 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. రూ. 10 వేల లోపు డిపాజిట్ దారులలో ఉన్న 54,027 మందికి రూ. 29.52 కోట్లు, 10 వేల నుంచి 20 వేల వరకూ డిపాజిట్ దారులలో ఉన్న 37,562 మంది బాధితులకు రూ. 52.95 కోట్లు వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతున్నదన్నారు.
గూడవల్లికి చెందిన రమాదేవి మాట్లాడుతూ తనకు పాప పుట్టినపుడు ఆమె భవిష్యత్తుకు కొంత సొమ్మును అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేశామన్నారు. తీరాచూస్తే ఆడబ్బు పోయిందని చాలా బాధపడ్డామని ఈ సమయంలో ముఖ్యమంత్రి జగనన్న తమకు భరోసా ఇచ్చి దేవుడిలా నిలిచి మాకు ఈరోజు ఆసొమ్ము అందేటట్లు చేసినందుకు వారికి రుణపడి ఉంటామన్నారు. అంతేకాకుండా జగనన్న ప్రభుత్వం ద్వారా తనతండ్రి, అత్తలు వైయస్ఆర్ పెన్షన్ కానుక పొందుతున్నారని, తనకుమార్తెకు అమ్మఒడి, తమకు ఇల్లు కూడా మంజూ రైందన్నారు. ఇంతలబ్ది పొందిన తాను జగనన్నకు స్వయంగా రాఖీ కట్టలేకపోయానన్న బాధ ఉందని, ఏదైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్నకు ఎల్లవేళలా అండగా ఉంటామని రమాదేవి అన్నారు.
పాతపాడు పంచాయతి మంగళంపాలెంకు చెందిన కొండ్రెడ్డి నాగలక్ష్మి మాట్లాడుతూ తాను అనారోగ్యం పాలై వీల్ ఛైయిర్ మీద జీవనం సాగిస్తున్నానన్నారు. తాను అగ్రిగోలో డిపాజిట్ చేసుకున్న సొమ్ము వస్తుందని వాలంటీర్ రాజు మాఇంటికి వచ్చి చెప్పి అందుకు అవసరమైన వివరాలను తీసుకున్నారని ఈ రోజు ఆసొమ్ము తనకు జమకావడం సంతోషంగా ఉందని ఇందుకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ప్రస్తుతం తాను వైయస్ఆర్ పెన్షన్ కానుక క్రింద పెన్షన్ పొందుతున్నానని, నాకు మరింత వీలైనంత సహాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు.
గూడవల్లికి చెందిన విజయ మాట్లాడుతూ నెలకు రూ. 500 చొప్పున అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేశానన్నారు. మోసపోయిన తమను గత ప్రభుత్వం పట్టించుకోలేదని తాము నిరాశతో ఉండగా తమకు జగనన్న బాపటగా నిలిచారన్నారు. వస్తాయో, రావో అనే అయోమయంలో ఉన్న సమయంలో అందులోనూ కోవిడ్ టైమ్ లో మాసొమ్ము తిరిగి మాకు అందించిన ముఖ్యమంత్రి జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా వైయస్ఆర్ ఆపరా, చేయూత లబ్ధి పొందానని, తమ పిల్లలకు విద్యాదీ వెనె, వసతి దీవెనె రాగా తన భర్తకు వాహనమిత్ర ద్వారా జగనన్న సహాయం అందిందన్నారు.
మరొక యువతి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ 2013 లో పొమ్ము డిపాజిట్ చేశామని మధ్యలో అకం పెనీ ఎత్తివేయడంతో కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకున్న తాము ఎంతో బాధ పడ్డామన్నారు. పాదయాత్రలో జగనన్న ఇచ్చిన మాట నిలుపుకున్నారని ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. జగనన్న పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదలకు బాసటగా నిలుస్తున్నాయన్నారు. అంతేకాకుండా తనభర్త వాహనమిత్ర ద్వారా ప్రయోజనం పొందారని ఆమె చెప్పారు.