సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా వుండండి…

-వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తి చేయాలి…..
-అర్హులైన కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డులు జారీ చేయాలి…
-సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా వుండి డెంగ్యూ, మలేరియా జ్వరాల నియంత్రణపై మెడికల్ ఆఫీసర్ ఏఎన్ఎం స్థాయి వరకు స్పష్టమైన అవగాహన వుండాలని సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి విజయవాడ డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంటీ- వెక్టర్ కంట్రోల్ టీమ్ ద్వారా సీజనల్ వ్యాధులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి అవసరమైన వైద్యం, టెస్టులు చేయలన్నారు. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలని ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సచివాలయంలోగల ఆరోగ్య మిత్ర సేవలపై ఏఎన్ఎంలకు మెడికల్ ఆఫీసర్లు అవగాహన కల్పించి గర్భిణీ స్త్రీలకు అవసరమైన సేవలందించాలన్నారు. ఫీవర్ సర్వే నందు గుర్తించిన వారికి శాంపిల్ సేకరించి టెస్టులు నిర్వహించాలన్నారు. ఎక్కువ సచివాలయాల్లో రైస్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇతర దృవీకరణ పత్రాలను ప్రింట్ చేసి ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచుతున్నారని ఈ విషయంపై తహాశీల్దార్లు, యంపిడివోలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్ పై సమీక్షిస్తూ గ్రౌండింగ్, బేస్మెంట్ లెవెల్ లక్ష్యలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పియంజి ఏవై బియ్యం పంపిణీ కార్యక్రమం నూరు శాతం పూర్తి చేయాలన్నారు. పంటల ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తహాశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు రైతులకు అందేందుకు ఈ-క్రాప్ నమోదు ఎంతో ముఖ్యమన్నారు. కౌలు రైతులకు సిసిఆర్ సి కార్డులను త్వరితగతిన జారీ చేసే విషయంలో తహాశీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సందర్భంగా స్పందన, గ్రామ/వార్డు సచివాలయాలు- సేవలు భూసేకరణ, ఫీవర్ సర్వే, సివిల్ సప్లయిస్ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఏవో ఎస్ శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ ఇఇ వి. శ్రీదేవి, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇఇ కె. సుజాత, డిప్యూటి డియం హెవో డా. జె. ఇందుమతి, ఎయంఓ హెచ్ వియంసి డా. సురేష్ బాబు, వ్యవసాయ శాఖ డిడి డి. జ్వోతి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *