Breaking News

జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం లోని గోతుల పడ్డ రోడ్లకు మరమ్మతులు…


-పన్నులు ప్రజలే కట్టాలి గోతులు పడ్డ రోడ్లకు ప్రజలే మరమ్మతులు చేసుకోవాలి పశ్చిమ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి…
-సొంత ఖర్చులతో వెట్మిక్స్ ద్వారా గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ నుంచి నెహ్రూ బొమ్మ వరకు ప్రధాన రహదారి కె టి రోడ్డు కు అనేక గోతులు పడి రోడ్లు చిద్రం అయిపోయిన ఐదారు నెలల నుంచి కనీస మరమ్మతులకు నోచుకోక లేదని, అనేక సార్లు మంత్రికి, మేయర్ కి మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసినా కనీసం రెండు అడుగుల మేర గోతుల పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదని, చిన్నపాటి వర్షానికే జలమయం అవుతున్నాయని, మోతీ మసీదు ముందర వద్ద చిన్నపాటి వర్షానికే ముంపు గురవుతుందని, శాశ్వత పరిష్కారం చూపమని పదేపదే విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని అందుకని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో వెట్మిక్స్ ద్వారా గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపట్టామని జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తెలియజేశారు. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, vmc అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని, వారికి నచ్చిన కాంట్రాక్టర్ ఇష్టం వచ్చిన పర్సంటేజ్ ఇచ్చేంత వరకు రోడ్డుకు కనీస మరమ్మతులు చేపట్టార అని ప్రశ్నించారు. రాబోయే 48 గంటల్లో ఈ ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపట్టి నూతన బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, మోతీ మసీదు వద్ద ముంపుకు శాశ్వత పరిష్కార దిశగా పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మేము కె.టి రోడ్డుకు గోతులపడ్డ రోడ్లకు మరమ్మతులు చేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని 1 ప్రజల ఇబ్బందులను కొంత మేరయినా తగ్గించాలని, అదేవిధంగా మంత్రి మరియు మేయర్ కియా కార్నివాల్ కార్లు దెబ్బతినకుండా ఉండేందుకు కూడా మరమ్మతులు చేపట్టామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పిల్ల శ్రీనివాసరావు, బత్తుల వెంకటేష్ , తమ్మిన రఘు, షేక్ అమిర్ భాష,బొట్ట సాయి, లీలా కర్ణాకర్, లింగం శివ ప్రసాద్, సోమిమహేష్, నూకరాజు, పిళ్ళ నాగరాజు , కొరగంజి సాంబ  తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *