అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారిగా ఎస్ వి మాధవ్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈ స్ధానంలో పి.జాషువా బదిలీకాగా, మాధవ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా రాజ్ భవన్ లో గవర్నర్ కు ఎయిడ్-డి-క్యాంప్ (ఎడిసి)గా ఉన్నారు. కడపకు చెందిన మాధవ రెడ్డి 2010 లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా గ్రూప్ 1 కు ఎంపికై పోలీసు శాఖలో వివిధ పదవులను సమర్ధ వంతంగా నిర్వహించి వన్నె తెచ్చారు. శిక్షణ అనంతరం తొలుత కర్నూలు జిల్లా ఆత్మకూరు, నిర్మల్ లలో డిఎస్పిగా పనిచేసి 2018లో అదనపు ఎస్పిగా పదోన్నతి పొందారు. తదుపరి కర్నూలు అదనపు ఎస్పి (పరిపాలన)గా పనిచేసి గుర్తింపు పొందారు. విజయవాడ ట్రాఫిక్ డిసిపిగా రహదారి భద్రతకు సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించారు. తన సర్వీసు కాలంలో నాలుగు సంవత్సరాల పాటు ఫారెస్టు రేంజ్ అధికారిగా పనిచేసి అటవీ చట్టాల పట్ల పూర్తి అవగాహన గడించారు. బాధ్యతలు తీసుకున్న తరుణంలో మాధవ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అక్రమాలకు తావు లేని విధంగా విజిలెన్స్ నిఘాను పటిష్టపరుస్తామన్నారు.
Prajavartha Online Telugu News