
-సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి…
-ఖరీఫ్ సీజన్ లో రైతులు ఈ – క్రాప్ నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ -19 నియంత్రణతో పాటు సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ముందస్తు ప్రణాళికతో జిల్లా కలెక్టర్లు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కోవిడ్ -19 మరియు సీజనల్ వ్యాధులు, ఎస్ఆర్ఇజిఎస్ పనులు, గ్రామ/వార్డు సచివాలయలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలు, నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పురోగతి, అర్హత ఉన్న వారికి 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ, ఖరీఫ్ ఈ- క్రాఫ్ పంటనమోదు, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహాక్కు మరియు భూ రక్ష పథకం వంటి తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) డా. కె.మాధవిలత, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాసు నూపూర్ అయజ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ వి.ప్రసన్నవెంకటేష్, హౌసింగ్ పీడీ కె. రామచందన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీసీ ద్వారా సమీక్షిస్తూ కోవిడ్ నియంత్రణతో పాటు సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫైడ్ వంటి వ్యాధులు ప్రభలకుండా ప్రణాళికా బద్దంగా చర్యలు చేపట్టాలన్నారు. వాణిజ్య, వ్యాపారసముదాయాలలు మాస్కలు ధరించడం, బౌతిక దూరం పాటించండం వంటి నిబంధనలు పాటించాలన్నారు. పాఠశాలల్లో విద్యాశాఖ కోవిడ్ నియంత్రణ పట్ల ఖచ్చితమైన నిబంధనలను అనుసరిస్తూ కోవిడ్ పరీక్షలను నిర్వాహించాలన్నారు. కోవిడ్ ధర్డ్ వేవ్ చిన్నారుల పై పడే ప్రభావం ఉన్నందున ఇప్పటి నుంచే నియంత్రణపై దృష్టి సారించారన్నారు. గ్రామాల రూపురేఖలు మార్చే విధంగా సచివాలయాలు, ఆర్బీకేలతో పాటు ఇంగ్లీషు మీడియం స్కూల్సు, వైఎస్సార్ భవనాలు, డిజిటల్ లైబ్రరీలు, ప్రీ ప్రైమరీ స్కూల్సు సంబందించి పనుల్లో ఎక్కడా నాణ్యత తగ్గకుండా పూర్తి చెయ్యాలన్నారు. అక్టోబరు 2 నాటికి 75 శాతం గ్రామ సచివాలయ భవానాలు పునులు పూర్తి చెయ్యాలని ఆ దిశగా కలెక్టర్ల పర్యవేక్షణ చేయ్యాలన్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలెంటీర్లు పెర్ఫార్మెన్స్, డ్యూటీలు, రికార్టుల నిర్వహాణ, బయోమెట్రిక్ విదానం వంటి తరచూ కలెక్టర్లు, జేసీలు, పీవోలు, కమీషనర్లులు తనిఖీలు నిర్వహించాల్నారు. పెన్షన్, రెైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు, అర్హులకు ఇళ్ల స్థలాలు నిర్ణీత కాలవ్యవధిలోనే అందించాలన్నారు. జగనన్న లైఅవుట్లలో వాటర్ సప్లై, విద్యుత్ సపై పనులు 93 శాతం జరగ్గా, ఎన్ఆర్ఈ జీఎస్ క్రింద చేపట్టిన పనులు 83 శాతం జరిగాయని సెప్టెంబరు 15 నాటికి నూరు శాతం పూర్తి చెయ్యాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబందించి ఇటుక, సిమ్మెంట్, ఐరన్ వంటి మెటీరియల్ నాణ్యత పై జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ చేయాలన్నారు.
ఖరీఫ్ సాగులో రైతులు తాము పండించే పంటను ఈ – క్రాఫ్ నమోదు చేయడం వలన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వంటి వర్తిస్తాయన్నారు. అదేవిధంగా ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించే విదంగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టరు పర్యేవేక్షణ చేయాలన్నారు. వ్యవసాయ అంశాలు రైతు సమస్యలు పై ఆర్బీకే, మండల, జిల్లా స్థాయిలో మొదటి, రెండవ, మూడవ శుక్రవారం అగ్రికల్చర్ ఎడ్వజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో భాగంగా రీసర్వే పనులను లక్ష్యాలు మేరకు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల పై దృష్టిని సారిస్తూ నిపుణలతో బ్యాంకర్లతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ రిజర్వేషన్లు వారి స్థానికులు పరిశ్రమలు అభివృద్ది చేసే విధంగా చర్యుల చేపట్టాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల ప్రిన్స్ పుల్ సెక్రటరీలు హాజరు కాగా జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) డా.కె.మాధవిలత, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ జాయింట్ కలెక్టర్ (హౌసింగ్), శ్రీవాసు నూపూర్ అయజ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ వి.ప్రసన్నవెంకటేష్, హౌసింగ్ పీడీ కె.రామచందన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News