Breaking News

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ) డ్రైవ్‌…


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో బుధ‌వారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ) డ్రైవ్‌ వైద్య, ఆరోగ్యశాఖ ప్రారంభించింది. నెలల చిన్నారికి సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్‌ వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, ఇప్పటివరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్‌లు అందిస్తున్న ప్రభుత్వం, కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్‌లు పిల్లలకు ప్రభుత్వం ఇవ్వనుంది . ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *