అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ స్టేట్ బెవరేజ్స్ కార్పొరేషన్ వారి 20 వ బోర్డ్ సర్వ సభ్య సమావేశం నందు తీసుకున్న నిర్ణయాలు…
1. ప్రభుత్వ మధ్య దుకాణాలను క్రమ రీత్యా తనికీలు నిర్వహించి లోటుపాట్లను సరిదిద్దవలసినదిగా ఆదేసించడం అయినది తదుపరి అధిక మొత్తం వినియోగాన్ని తగ్గించడం గాను మరియు అసాంఘిక కార్యకలాపాలను నాటు సారా స్మగ్లింగ్ అక్రమ రవాణా నిరోధించుటకు గాను సరిహద్దు రాష్ట్రాల గ్రామాల మద్యం దుకణములందు 90ml పరిమాణం గల మద్యాన్ని అట్లనే can beer ను అమ్మకమునకు అనుమతి ఇవ్వడం అయినది
2. తదుపరి అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రసాయన ప్రయోగ శాల ల ఆధునీకరణకు గాను ఒక్కో ప్రయోగ శాల కు 5,00,000 రూపాయల మేరకు నిధులు మంజూరు చేయుటకు అనుమతి ఇవ్వడం అయినది.
3. ఆధునీకరణ మొత్తం 10 దినములలో పూర్తి చెయిటకు సమయము ఇవ్వడం అయినది.
4. ప్రయోగశాల యందు నిర్వహించు ప్రయోగముల పట్టికను బహిరంగ పరుచుచు బోర్డును ఏర్పాటు చేయవలసినదిగ ఆదేశించడం అయినది.
5. ప్రభుత్వం చే ఏర్పాటు చేయబడ్డ walk-in stores నందు లభించు మద్యం యొక్క వివరములు మరియు ధరలతో కూడిన పట్టికను ఉంచవలసినదిగా ఆదేశించడం అయినది.
6. APSBCL M.D చే సమయాను కూలంగ జారీ చేయబడ్డ ఉత్తర్వులు తనికీ రిపోర్టు CFMS చలానా reconciliation ను స్టాక్ వెరిఫికేషన్ మొదలైన వాటిని అబినందించడమైనది.
7. AP online వారిచే నిర్వహింప బడుతున్న :
CFMS అనుసంధానము scanning ద్వారా నూరు శాతం అమ్మకము రియల్ టైమ్ గవర్నన్స్ భాగమైన ఆటో reconciliation, virtual heal, real time stock verification, tracking and recovery, దుకాణాల మధ్యలో స్టాక్స్ బదిలీలు , స్కానింగ్ ద్వారా స్టాకును తీసుకొనుట మరియు damaged స్టాక్ నిర్వహణ మొదలైన వాటిని సమర్థ వంతంగా నిర్వహించినందుకు MDకి అభినందనలు తెలియజేయడం అయినది.
8. స్టాక్ ఆడిట్ నిలువల తనిఖీ కోసము ప్రతేక స్వయంప్రతిపత్తి కలిగిన ఆడిట్ పార్టీ ని 01st September నుండి ఏర్పాటు చేయడమైనది .
ఈ సమావేశం నందు బోర్డ్ చైర్మన్ అయిన Spl CS Dr. Rajath Bhargava, IAS , బోర్డ్ డైరెక్టర్స్ అయిన M.D ., APSBCL D. వాసుదేవ రెడ్డి, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు మరియు జనరల్ మనేజర్ పేతురయ్య, కంపెనీ సెక్రటరీ, ఇతర అధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News