Breaking News

తెలుగు భాషా దినోత్సవం మరియు గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం…


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు భాషా పరిరక్షణకు ప్రభుత్వం పునరంకితమవుతుందని, పాఠశాల నుంచి పరిశోధన స్థాయి వరకు అన్ని దశల్లో తెలుగు అమలు కోసం తగిన కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. తెలుగు మరియు సంస్కృత అకాడమి ఆధ్వర్యాన శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం వేడుకగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సురేశ్ మాట్లాడుతూ తెలుగు అక్షరాలు కూడా నేర్చుకోకుండానే పి.జి కోర్సు వరకు చదువుకునే పరిస్థితి గతంలో ఉండేదని విమర్శించారు. పాఠశాల స్థాయిలో తెలుగును తప్పనిసరి అంశంగా చేసిన తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వచ్చే ఏడాది తెలుగుభాషోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహిస్తామన్నారు.తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని భారత తపాలాశాఖ ప్రత్యేకంగా రూపొందించిన తపాలా కవరును మంత్రి ఆవిష్కరించారు. తెలుగుతో పాటు ఇతర సబ్జెక్ట్ లలో కృషి చేసిన ప్రముఖలను గుర్తించి సత్కరిస్తామన్నారు. గిడుగు రామమూర్తి పంతులు చేసిన వ్యావహారిక భాషోద్యమ ఫలితంగా వాడుకభాష గద్దెనెక్కిందని, సమాజంలోని ప్రతి పౌరుడికి విద్య చేతికి అందిందన్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ చదువుల కోసం ఇంగ్లిషును ఆశ్రయించినా మనసులు మాత్రం తెలుగును నింపుకోవాలన్నారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పేరును తిక్కన విశ్వవిద్యాలయంగా మారుస్తున్నట్లు ప్రకటించారు. సభకు అధ్యక్షత వహించిన అకాడమి అధ్యక్షురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తెలుగు, సంస్కృత భాషల పరస్పర సంబంధాన్ని వివరించారు. గత ప్రభుత్వం తెలుగు అకాడమి పేరు కూడా తలచలేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలుగు అకాడమీ ఊపిరిపోసుకుందన్నారు. అకాడమి సంచాలకులు వి.రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ నుంచి మన తెలుగు అకాడమీకి రావాల్సిన నిధులు అతి త్వరలోనే అందనున్నట్లు ప్రకటించారు. తెలుగు, సంస్కృత భాషా, సాహిత్య రంగాల్లో కృషి చేసిన 13 మంది ప్రముఖులను గిడుగు రామమూర్తి భాషా పురస్కారంతో సత్కరించారు. అకాడమి పాలకమండలి సభ్యులు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, డాక్టర్ విజయశ్రీ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాజశేఖర్, రెక్టార్ ఆచార్య వరప్రసాదమూర్తి, రిజిష్ట్రార్ బి.కరుణశ్రీ, ఎ.ఎన్.యు క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాచార్యులు పి.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గిడుగు రామమూర్తి భాషా పురస్కార గ్రహీతలు
1. ఆచార్య శలాక రఘునాథ శర్మ
2. డాక్టర్ మేడసాని మోహన్
3. శ్రీ మొవ్వ వృషాద్రిపతి
4. డాక్టర్ కోడూరు ప్రభాకర రెడ్డి
5. శ్రీ వాడ్రేవు సుందరరావు
6. డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ
7. డాక్టర్ ఉపద్రష్ట వేంకట రమణమూర్తి
8. శ్రీమతి ఎస్. సుధారాణి
9. శ్రీ జి.ఎస్.చలం
10. శ్రీ కెంగార మోహన్
11. శ్రీమతి షహనాజ్ బేగం
12. శ్రీ మల్లిపురం జగదీష్
13. శ్రీ పచ్చా పెంచలయ్య

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

APSRTC ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమానికి మరో ముందడుగు

-ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్యమే లక్ష్యం – రూ.22లక్షల నూతన Fully Automated ImmunoAssyAnalyzerప్రారంభం -ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లే అవసరం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *