నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ మండలంలోని సోమవారం గ్రామంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం తో కలిసి ప్రభుత్వ విప్ మరియు నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో సమావేశమై, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం యొక్క సుపరిపాలన లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం, వారి నమ్మకాన్ని బలోపేతం చేయడం జరిగింది. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతించారు మరియు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మండల కృష్ణకుమారి, గ్రామ సర్పంచులు, కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News