శ్వేత పత్రం విడుదల చేయాలి… : ఎన్.యస్.యు.ఐ. వేముల శ్రీనివాస్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
SC, ST సబ్ ప్లాన్ ను చట్టం ద్వారా నాటి తెలుగుదేశం ప్రభుత్వం నుండి ఇప్పటి వైసిపి ప్రభుత్వం వరకూ ఖర్చు పెట్టిన నిధులు, ఖర్చు చేసినవి పోగా పెండింగ్ లో ఉన్న నిధులు యొక్క వివరాలు శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు SC, ST సబ్ ప్లాన్ ను చట్టం చేసినందుకు అప్పట్లోనే రాష్ట్రంలోని దళిత గిరిజన ప్రజలు కాంగ్రెస్ పార్టీయే దళిత గిరిజన ప్రజల పాలిట దళితబంధుగా భావించి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి దళితబంధు బిరుదు ఇచ్చారన్నారు. SC, ST సబ్ ప్లాన్ చట్టం చేసిన తర్వాత రాష్ట్రంలోని దళిత గిరిజన ప్రజలు చాలా సంతోషంతో ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. కానీ ఇప్పటి జగన్ ప్రభుత్వం, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం SC, ST సబ్ ప్లాన్ చట్టాన్ని సరిగ్గా అమలు చేయకుండా రాష్ట్రంలోని దళిత గిరిజన ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చెందనీయకుండా వెనుకబాటు తనానికి లోను చేయడం జరిగిందనీ, జరుగుతుందన్నారు. SC, ST సబ్ ప్లాన్ ను చట్టం చేసిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం నుండి ఇప్పటి వైసిపి ప్రభుత్వం వరకూ పెండింగ్ లో ఉన్న సబ్ ప్లాన్ నిధులు యొక్క వివరాలు శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలన్నారు. నాడు SC, ST సబ్ ప్లాన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహం గారు అసెంబ్లీ కి తెచ్చిన బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే నాటి YSRCP, TDP లు రెండూ సానుకూలంగా స్పందించిక పోయినప్పటికీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చాకచక్యంతో ఆ బిల్లును నెగ్గించి చట్టం చేసిందన్నారు. ఇప్పటికీ ఈ సబ్ ప్లాన్ చట్టం మన తెలుగు రాష్ట్రాలలో తప్ప ఇంక ఎక్కడా లేదు అని.. అధికారంలోకి వచ్చాక ఇన్నాళ్టికి మొద్దు నిద్ర లేచిన కేసీఆర్ ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పై గెలుపు కోసం తెలంగాణలో దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారనీ ఒక్కొక్క దళిత కుటుంబానికి 10,00,000 లక్షలు ఇస్తున్నారనీ, ఆ డబ్బు ఎక్కడ నుండి వస్తున్నాయంటే SC, ST సబ్ ప్లాన్ నిధులు నుంచే అనీ, ఈ చట్టానికి ఏపి రాష్ట్రంలో సియం జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారనీ, ఈ చట్టంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే ఈ సంవత్సరం కేటాయించిన సొమ్ము ఖర్చు పెట్టలేకపోతే వచ్చే ఏడాదికు జమ అవుతుంది, బడ్జెట్ సొమ్ము క్యారీ ఫార్వర్డ్ అవ్వవనీ, కానీ SC, ST సబ్ ప్లాన్ నిధులు క్యారీ ఫార్వర్డ్ అవుతాయన్నారు. గత 7 సంవత్సరాలుగా తెలంగాణాలో ఆ డబ్బులు ఖర్చు చేయలేదు కనుకనే ఆ మిగులు నిధులతోనే తెలంగాణలో దళితబంధు పథకం ప్రవేశ పెట్టారనీ.. నేడు దళిత గిరిజన ప్రజలు ఆర్థికంగా వున్నారంటే అంటే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీదేనన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *