Breaking News

అక్టోబర్2న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరపున సలాం సి.యం సార్ కార్యక్రమం : ఎం.డి.జాని పాషా

-సలాం సి.యం సార్ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి ప్రస్తుత ఎం.యల్.సి డొక్కా.మాణిక్య వరప్రసాద్
-సచివాలయ వ్యవస్థ ద్వారానే గాంధీజీ కలలు కన్న నిజమైన గ్రామ స్వరాజ్యం సాకారం అయ్యింది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సంకూరి.రాజారావు అధ్యక్షతన గుంటూరు జిల్లా సమావేశానికి ముఖ్యఅతిధులుగా హాజరైన మాజీ మంత్రి ప్రస్తుత శాసనమండలి సభ్యులు డొక్కా.మాణిక్య వరప్రసాద్ మరియు ఫెడరేషన్ అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ముందుగా సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్2వ తేదీన ముఖ్యమంత్రికు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమానికి సంబందించిన
సలాం సి.యం సర్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1.34లక్షల మంది నిరుద్యోగుల కుటుంబాలకు జీవితంలో మరువలేని మేలు చేశారని,వచ్చిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరారు.అలాగే విధినిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని,ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు.సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా తన సహకారం అందిస్తానని తెలిపారు.అనంతరం ముఖ్య అతిధిగా పాల్గొన్న ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగాల ద్వారా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం లభించడం నిజంగా గొప్ప అవకాశం అని,ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం ప్రతి సచివాలయ ఉద్యోగి బాధ్యత అని అందుకు గాను గత సంవత్సరం థాంక్యూ సి.యం సర్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని,ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన సలాం సి.యం సర్ కార్యక్రమం నిర్వహించి ప్రతి సచివాలయ ఉద్యోగి సేవకార్యక్రమాలు ఘనంగా చేపట్టాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు.అలాగే ఎటువంటి టెస్ట్లతో సంభందం లేకుండా రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను నేరుగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ప్రభుత్వానికి వినతి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు జి.రమేష్, ఆవుల.రాజా రావు, షేక్.మీరవాలి, నర్రావుల.వీరబ్రహ్హం, జె.ప్రదీప్, వి.యలమంద, ఎం.రమేష్ బాబు, టి.మహేష్ బాబు, ఎం.సుబ్బారావు, షేక్.షుకూర్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *