Breaking News

సెంట్రల్ నియోజకవర్గవ్యాప్తంగా వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పాయకాపురం సంతోషిమాత ఆలయంలో మన గుడి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ లోకానికి జ్ఞానాన్ని పంచిన గీతాచార్యుడు అయిన శ్రీ కృష్ణుని జన్మదినోత్సవం నేడన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఆదేశముల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో “మన గుడి ” కార్యక్రమం నిర్వహించుకోవటం జరిగిందన్నారు. గోవు సమస్త దేవతా స్వరూపమన్నారు. ప్రతి శుభకార్యంలోనూ ముందుగా గో పూజ చేస్తాం.. గో మాత కు అంతటి ప్రాముఖ్యత ఉందన్నారు. సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చ‌ర్య‌లు చేప‌ట్టిందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందన్నారు. గోవుల ప్రాశస్త్యంను గుర్తించి, గోపూజ కార్యక్రమానికి ప్రాముఖ్యతనిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి, టీటీడీ చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజులలో అన్ని దేవాలయాలలోను గో మాతల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకుంటే గోదానం చేసిన ఫలితం వస్తుందన్నారు. అదేవిధంగా ఆనాడు బృందావనంలో కృష్ణ పరమాత్మ ఉట్టిని కొట్టిన విధానాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని “ఉట్టి మహోత్సవం” కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పర్వదినాన ప్రతిఒక్కరు భగవంతుని దర్శనం చేసుకొని శాంతి సౌభాగ్యాలు పొందాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. అనంతరం శాసనసభ్యులు ఉట్టిని కొట్టి అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత యాదవ సమాఖ్య ప్రెసిడెంట్ లాక వెంగలరావు యాదవ్, వైఎస్సార్ సీపీ నాయకులు అలంపూర్ విజయ్, వీరబాబు, బోరా బుజ్జి, రామిరెడ్డి, రాజారెడ్డి, హైమావతి, సంతోషిమాత దేవాలయ ప్రెసిడెంట్ చిన్ని చిట్టిబాబు, టీటీడీ దేవస్థాన ప్రోగ్రాం అసిస్టెంట్ సి. వి. కె. ప్రసాద్, ధర్మ ప్రచార మండలి సభ్యులు బొగ్గరపు వెంకట బాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *