Breaking News

కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గ రైతులు, డ్వాక్రా మహిళలకు రూ. 42 కోట్ల రుణాలు పంపిణీ…

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీ), PACS ల ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని రైతన్నలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ. 42 కోట్ల మెగా రుణాలను పంపిణీ చేశారు. మంగళవారం జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని బి కన్వెన్షన్ హాల్ లో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మొండితోక అరుణ్ కుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొని రైతులు, డ్వాక్రా మహిళలకు రూ. 42 కోట్ల రూపాయల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యఅతిథులను, PACS అధ్యక్షులను గజమాల, శాలువ, మెమెంటో లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త సామినేని రవిచంద్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు కొమ్మినేని రవిశంకర్, వేములకొండ రాంబాబు, విమలాభాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలాభాను, వైఎస్ఆర్ సీపీ యువనాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, జగ్గయ్యపేట నియోజకవర్గ సహకార సంఘ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ లు, కేడీసీసీ బ్యాంకు, PACS సిబ్బంది, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *