Breaking News

జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు ఎమ్. తిరుమల దాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు జగనన్న కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానం లో నూతన ఒరవడి సృష్టించి నాడు నేడు ద్వారా పాఠశాలలు స్వరూపాన్ని పూర్తిగా మార్చి వేశారన్నారు. విద్యా విధానం లో భాగంగా జగనన్న విద్యా కానుక కిట్లు అందించడం జరిగిందన్నారు. మా పాఠశాల పరిధిలోని 167 విద్యార్థులకు, 153 విద్యార్ధిని లకు మొత్తం 320 మందికి కిట్లు పంపిణీ చేస్తూన్నామన్నారు. ఈ కిట్లు లో స్కూల్ బ్యాగ్, టెస్ట్, నోట్ పుస్తకాలు, 3 జతల బట్టలు, షూస్, జత సాక్స్ లు, టై, బెల్ట్ తదితరాలు అందచేస్తున్నట్లు దాస్ పేర్కొన్నారు. ఆగస్ట్ 16 నుంచి పంపిణీ చేస్తున్నామను, కరోనా మార్గదర్శకాలు అనుసరించి ఇప్పటివరకు 272 మందికి కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్. భాస్కర్, కె.సుబ్బారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో గ్రామసభల నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *