రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా కృషి చేయాలి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా కృషి చేయాలని రాష్ట్ర లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం అన్నారు. మంగ‌ళ‌వారం  విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ కార్యవర్గ నియామకం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న వైసిపి ప్రభుత్వ ఒంటెద్దు పోకడలకు, అనాలోచిత నిర్ణయాలకు మరియు రాజ్యాం, చట్ట వ్యతిరేక పనుల వలన జరుగుతున్న నష్టాలను వాటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ప్రణాళికలు సిద్ధం చేయాలని, దేశ ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళల తాపత్రయం పడే రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే  అది కాంగ్రెస్ పార్టీయే అనీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా వుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం రాష్ట్ర లీగల్ సెల్ మరింత బలోపేతం అవ్వాలనీ, ఈ దేశానికి రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా కృషి చేయాలన్నారు. సమావేశం అనంతరం సీనియర్ న్యాయవాది కేశన రామకోటేశ్వరరావు ని రాష్ట్ర ఉపాధ్యక్షులు గానూ, ఇమ్మడి వెంకట్రావు, రొబ్బా నాని బాబు, వీరపనేని  ఈశ్వరయ్య చౌదరి, కారుకొల్ల సింహాచలం, మేళ్ళం మనోజ్ కుమార్, సనపాల యమ్.యమ్.యమ్. కృష్ణలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగానూ, రాష్ట్ర కార్యదర్శులుగా మల్లికార్జున్, మొగసటి భాస్కర రాజు, దాసి వెంకయ్య, దాసరి అమెన్ జోసెఫ్లను, రాష్ట్ర సహాయక కార్యదర్శులుగా మైల అను ప్రవళ్ళిక, కారెద్దుల సుష్మా,  కారం బాను లను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.యస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, న్యాయవాది సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొడిపిరెడ్డి రామకృష్ణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *