విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ని, సంక్షేమ పథకాల ఆద్యుడు గా పేద ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని డివిజిన్లలో స్థానిక వైస్సార్సీపీ కార్పొరేటర్లు, ఇన్ ఛార్జ్ లు నిర్వహించిన వర్థంతి కార్యక్రమలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ వైయస్ఆర్ విగ్రహలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సామాజిక సేవ కార్యక్రమలను ప్రారంభించారు. ఆయా డివిజన్లలో ఏర్పాటు చేసిన మెగా అన్నదాన కార్యాక్రమాలు అవినాష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాడు ముఖ్యమంత్రి గా వైయస్సార్ పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసారని,పేదరికం కారణంగా ఎవరు కూడా విద్య,వైద్యం వంటి ప్రాధమిక అవసరాలకు దూరం కాకూడదని ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబెర్స్మెంట్ వంటి పథకాలకు రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి వైయస్సార్…, ఈరోజుకి కూడా 108 అంబులెన్స్ అంటే ఆయనే గుర్తుకు వస్తారని కొనియాడారు. రైతు మోములో చిరునవ్వులు చూడాలని తపించే వారని జలయజ్ఞం సాగించి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు లు నిర్మించారని,నేడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా తన పరిపాలన తో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తెలిపారు. ఆయన బాటలోనే నేడు జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలన చేస్తూ దేశములో మరే ముఖ్యమంత్రి చేయనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూన్నరని, సచివాలయ,వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకె పాలన సుసాధ్యం చేసారని అన్నారు. రాష్ట్రంలో ఇంత మంచి పరిపాలన సాగుతూ ప్రజలు అందరూ ఆనందంగా ఉంటే తట్టుకోలేక టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, నారా లోకేష్ పిచ్చి ప్రలపనలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవలని చూస్తున్నారు అని, ఆయన ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిన సరే ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో 49 కార్పొరేషన్ సీట్లు సాధించాం,విశాఖపట్నం, గుంటూరు కైవసం చేసుకున్నాం. రాష్ట్రంలో రాబోయే 30 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు. టీడీపీ పార్టీ ఇక జూమ్ కే పరిమితం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, కాపు కార్పొరేషన్ చైర్మైన్ అడపా శేషు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్పొరేటర్ లు, ఇన్ ఛార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.